పులిని చంపిన పెద్దపులి
ABN , Publish Date - Sep 09 , 2026 | 06:34 AM
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి ఏటిపరకాల పాయ బీటు పరిధిలో పులిపిల్ల మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మూడేళ్ల వయసున్న (యుక్తవయసు) మగపులిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు.
గిద్దలూరు అటవీ పరిధిలో ఘటన..
తన జోన్‌లోకి రావడంతోనే దాడి
కంభం(అర్ధవీడు), సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి ఏటిపరకాల పాయ బీటు పరిధిలో పులిపిల్ల మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మూడేళ్ల వయసున్న (యుక్తవయసు) మగపులిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. గిద్దలూరు డివిజన్ పరిధి తురిమెళ్ల రేంజ్‌లో లభించిన కళేబరాన్ని సోమవారం బీటు అధికారులు చూసి ఉన్నతాధికారులకు నివేదించారు. మంగళవారం డీఎఫ్‌వో నిషాకుమారి, ఐఎఫ్‌ఎస్‌వో బాలరాజు ఘటన స్థలానికి వెళ్లి ఎన్‌టీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టుమార్టం నిర్వహించారు. కళేబరంపై పులి పంజా గుర్తులు ఉన్నట్లు గుర్తించారు. పెద్దపులులు తమ ఉనికి చాటుకునేందుకు పలు ప్రాంతాల్లో మూత్రాన్ని విసర్జించడంతోపాటు గుర్తులను(టెరిటరీ)ఏర్పాటు చేసుకుంటాయని చెప్పారు. తమ ఆవాసంగా ఎంచుకున్న 10 కి.మీ. నుంచి 15 కి.మీ. అటవీ పరిధిలో(జోన్)కి మరో పులి వస్తే అవి దాడి చేస్తాయన్నారు. ఇలా పెద్దపులి జోన్‌లోకి వెళ్లగా, వాటి మధ్య పోరు జరగడంతో పులిపిల్ల మరణించి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని..