Share News

పడక గది ప్రశాంతంగా...

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:09 AM

పడక గదిలోకి ప్రవేశించగానే ప్రశాంతంగా అనిపిస్తూ హాయిగా నిద్ర ముంచుకొచ్చేందుకు అనుసరించాల్సిన చిట్కాలివే...

పడక గది ప్రశాంతంగా...

పడక గదిలోకి ప్రవేశించగానే ప్రశాంతంగా అనిపిస్తూ హాయిగా నిద్ర ముంచుకొచ్చేందుకు అనుసరించాల్సిన చిట్కాలివే...

  • పడక గది గోడలకు వేసే రంగులు, దుప్పట్లు, దిండు గలీబులు, కర్టెన్ల కోసం లేత తటస్థ రంగులను ఎంపిక చేసుకోవడం మంచిది. అహ్లాదకరమైన అనుభూతినిచ్చే నీలం, ఆకుపచ్చ షేడ్స్‌ అయితే బాగుంటాయి.

  • రాత్రి పూట సేదతీరేందుకు మరీ ప్రకాశవంతగా కాకుండా మసక వెలుతురునిచ్చే లైట్లను, వెచ్చటి అనుభూతినిచ్చే టోన్‌ ల్యాంప్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. వీటివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. నిద్రకు ఉపక్రమించే ముందు గదిని వీలైనంత చీకటిగా ఉంచుకోవడం మంచిది.

  • పడక గది కిటికీ నుంచి చెట్లు, ఆకాశం కనిపిస్తుంటే పర్వాలేదు. అలాకాకుండా బిల్డింగులు, రోడ్డు కనిపిస్తుంటే మాత్రం అనవసరమైన వెలుతురు లోపలికి ప్రసరించకుండా, శబ్దాలు వినిపించకుండా కర్టెన్‌ వేసేయాలి.

  • కాటన్‌ దుప్పట్లు, మరీ మెత్తగా లేదా గట్టిగా లేని దిండ్లు, తేలికగా ఉండే బ్లాంకెట్స్‌, సౌకర్యవంతంగా అనిపించే పరుపు... శరీర అలసటను తీర్చి హాయిగా నిద్రించేందుకు తోడ్పడతాయి.

  • పడక గదిలో అనవసరమైన వస్తువులు కనబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బెడ్‌ కింద స్టోరేజ్‌ బాక్సులో అలాగే సైడ్‌ టేబుల్‌ అరల్లో సామాన్లను సర్దేయాలి.

  • కిటికీ పక్కన లేదా టేబుల్‌పై ఒకట్రెండు ఇండోర్‌ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేసుకుంటే పడకగదిలో తాజాదనం నిండుతుంది.

  • పడక గదిలో టీవీ, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ లాంటివి పెట్టుకోకూడదు. బెడ్‌ పక్కన చిన్న డెకార్‌ ల్యాంప్‌, చేతికి అందేలా ఇష్టమైన పుస్తకాలు, ఓ మూలగా సెంటెడ్‌ క్యాండిల్‌, మృదువైన సంగీతం వినే ఏర్పాటు చేసుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా

రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 09 , 2026 | 12:09 AM