వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా
ABN , Publish Date - Sep 08 , 2026 | 05:59 PM
విజయనగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శీను) రాజీనామా చేశారు.
విజయనగరం, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శీను) రాజీనామా చేశారు. గత కొంత కాలంగా భీమిలీ నియోజకవర్గ సమన్వయకర్తగా చిన్న శీను ఉన్న విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా మజ్జి శీను వ్యవహరించారు. అలాగే, వైసీపీకి, భీమిలీ నియోజకవర్గ సమన్వయకర్త పదవికి, విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి శీను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. మజ్జి శీను పంపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సమర్థ నాయకత్వంతోనే సమస్యల పరిష్కారం: సీఎం చంద్రబాబు
గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి అమోఘం: యోగి ఆదిత్యానాథ్
పార్టీ అప్పగించిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News