కేబీఆర్‌కు గోదావరి జలాలు
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:27 AM
గోదావరి జలాలు ఎట్టకేలకు మంగళవారం రాత్రి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (కేబీఆర్)కు చేరుకున్నాయి.
అగనంపూడి/ఉక్కు టౌన్‌షిప్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):
గోదావరి జలాలు ఎట్టకేలకు మంగళవారం రాత్రి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (కేబీఆర్)కు చేరుకున్నాయి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం వద్ద అధికారులు సోమవారం ఏలేరు కాలువలోకి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏలేరు రిజర్వాయర్ నుంచి ఏలేరు కాలువకు నీటి ప్రవాహాన్ని క్రమేపీ తగ్గించారు. ఈ నేపథ్యంలో ఏలేరు కాలువ ద్వారా అనకాపల్లి, కొప్పాక, సిరసపల్లి, తాడి, లంకెలపాలెం, అగనంపూడి మీదుగా స్టీల్‌ప్లాంటులోని కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరుకున్నాయి. కేబీఆర్ నుంచి నీటిని జీవీఎంసీ అధికారులు పంపింగ్ ద్వారా నరవ ట్రీట్‌మెంట్ ప్లాంటుకు పంపనున్నారు.