బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని..
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:04 AM
డబ్బులు తెచ్చుకునేందుకు బైక్‌పై బ్యాంకుకు వెళ్దామని తన భర్తను రమ్మన్నా రాలేదన్న కోపంతో ఓ వివా హిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది.
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
నరసన్నపేట, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): డబ్బులు తెచ్చుకునేందుకు బైక్‌పై బ్యాంకుకు వెళ్దామని తన భర్తను రమ్మన్నా రాలేదన్న కోపంతో ఓ వివా హిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తె లిపిన వివరాల మేరకు.. మాకివలస గ్రామానికి చెందిన బొంగు లక్ష్మణరావు, నిర్మల (45) భార్యభర్తలు. సోమవారం ఉదయం 10గంటల సమయంలో నరసన్నపేటలో గల బ్యాంకుకు వెళ్లి డబ్బులు తెచ్చుకునేందుకు బైక్‌పై తీసుకుని వెళ్లాలని తన భర్త లక్ష్మణరావును నిర్మల కోరింది. ఆ సమయంలో చిన్న కుమారుడు బైక్‌ను తీసుకువెళ్లాడని భర్త చెప్పాడు. నేను ఎప్పుడు బ్యాంకుకు తీసుకుని వెళ్లమని కోరినా కుంటి సాకులు చెబుతున్నావంటూ భర్తపై నిర్మల మండిపడిం ది. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన నిర్మల ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఇది గమనించిన లక్ష్మణరావు ఇరుగుపొరుగు వారి సాయంలో నిర్మలను కిందకు దించి చికిత్స కోసం నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. భర్త లక్ష్మణరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ గీతకార్మికుడు..
నరసన్నపేట, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఉర్లాం పంచాయతీ కమ్మరిపేటకు చెందిన గీతకార్మికుడు పసుపులేటి ఈశ్వరరావు (53) శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఎస్‌ఐ బి.గణేష్ తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 1వ తేదీ రాత్రి ఈశ్వరరావు ఉర్లాంలో పూటుగా మద్యం తాగి వస్తూ రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈశ్వరరావు కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.