Share News

ఎస్ఐనంటూ నగల షాపు యజమానికి ఫోన్.. రూ.50 వేలు డిమాండ్

ABN , Publish Date - Sep 09 , 2026 | 06:57 AM

అక్రమంగా నగదు సంపాదించేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. ముద్దాయిలు తాకట్టు పెట్టిన బంగారం మీ వద్ద ఉందంటూ నగల షాపు యజమానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. నగదు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.

ఎస్ఐనంటూ నగల షాపు యజమానికి ఫోన్.. రూ.50 వేలు డిమాండ్

విజయవాడ, సెప్టెంబర్ 09: అక్రమంగా నగదు సంపాదించేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. ముద్దాయిలు తాకట్టు పెట్టిన బంగారం మీ వద్ద ఉందంటూ నగల షాపు యజమానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. నగదు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో సందేహించిన షాపు యజమాని పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంగారం షాపు యజమానికి.. ఆగంతకుడు ఫోన్ చేసి తాను రాయదుర్గం ఎస్ఐ అని చెప్పాడు. మర్డర్ ఫర్ గెయిన్ కేసు జరిగిందని.. మీ వద్ద ముద్దాయిలు తాకట్టు పెట్టిన బంగారం ఉందన్నాడు. ఈ నేపథ్యంలో అర్జెంట్‌గా రూ. 50 వేలు ఆన్‌లైన్‌లో తనకు పంపకుంటే మీపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపాడు.


ఈ ఫోన్ కాల్‌పై సందేహించిన షాపు యజమాని తిరువూర్ పోలీసులను ఆశ్రయించాడు. ఇది ఫేక్ కాల్‌గా పోలీసులు గుర్తించారు. ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తే.. 1930 లేదా112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులిని చంపిన పెద్దపులి

సర్క్యులర్‌లోని ధరకే రొయ్యల మేత విక్రయించండి

For More AP News And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 07:15 AM