సర్క్యులర్‌లోని ధరకే రొయ్యల మేత విక్రయించండి
ABN , Publish Date - Sep 09 , 2026 | 06:15 AM
రొయ్యల మేత ధరల పెంపును సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ వరకు ఈ ఏడాది జూన్ 12న ఇచ్చిన సర్క్యులర్‌లో నిర్దేశించిన ధరకే మేత విక్రయించాలని రొయ్యల మేత తయారీదారుల సంఘాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తయారీదారుల సంఘాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు
అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రొయ్యల మేత ధరల పెంపును సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ వరకు ఈ ఏడాది జూన్ 12న ఇచ్చిన సర్క్యులర్‌లో నిర్దేశించిన ధరకే మేత విక్రయించాలని రొయ్యల మేత తయారీదారుల సంఘాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. వనామీ రొయ్య మేతపై టన్నుకు రూ.9 వేలు, టైగర్ రొయ్యల మేతపై టన్నుకు రూ.12 వేలు పెంచుతూ రొయ్యల మేత తయారీదారుల సంఘం, అనుబంధ సంస్థలు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ..పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆక్వా రైతులు మల్లా తులసీరామ్, వెరవల్లి చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో పిటిషనర్ తరఫు న్యాయవాది కేఎల్‌ఎన్ స్వామి వాదనలు వినిపించారు.
ఈ వార్తలనూ చదవండి...
బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని.
‘అభివృద్ధికి అక్షరాస్యత దోహదం’