‘అభివృద్ధికి అక్షరాస్యత దోహదం’
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:07 AM
వ్యక్తిత్వ వికాసానికి, సమాజ అభివృద్ధికి అక్షరజ్ఞానం దోహదపడుతుందని న్యాయాధికారి ఎం.రోహిణీరావు అన్నారు.
బొబ్బిలి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వ్యక్తిత్వ వికాసానికి, సమాజ అభివృద్ధికి అక్షరజ్ఞానం దోహదపడుతుందని న్యాయాధికారి ఎం.రోహిణీరావు అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక కోర్టులో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల్లో అక్షరాస్యత పెరిగిన నాడే సమాజం వృద్ధి చెందుతుందన్నారు. చదువుకోవాలనే అభిలాషను పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.