వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణమిదే!
ABN , Publish Date - Sep 09 , 2026 | 07:51 AM
భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. దీనికి ప్రధాన కారణం ఆసియా క్రీడలు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. దీనికి ప్రధాన కారణం ఆసియా క్రీడలు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా ఆసియా గేమ్స్ జరగనున్నాయి. భారత పురుషుల టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.
ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు నేరుగా క్వార్టర్‌ఫైనల్లో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 28న క్వార్టర్‌ఫైనల్స్, అక్టోబర్ 1న సెమీఫైనల్స్, అక్టోబర్ 3న ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్-భారత్ మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 3న మూడో వన్డే చండీగఢ్‌లో జరగనుంది. దీంతో భారత్ ఆసియా క్రీడల ఫైనల్‌కు చేరితే.. ఒకే రోజు రెండు దేశాల్లో రెండు భారత జట్లు మ్యాచ్‌లు ఆడే అరుదైన పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుతం టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్.. వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గానూ కొనసాగుతున్నాడు. 2025 అక్టోబర్‌లో అతడిని వన్డే జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించారు. అయితే ఆసియా క్రీడల్లో భారత జట్టుకు అందుబాటులో ఉండాల్సి రావడంతో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు అయ్యర్ దూరం కానున్నాడు.
ఇవి కూడా చదవండి:
అఫ్గాన్-భారత్ టీ20 సిరీస్.. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు టీవీ ప్రసార హక్కులు
పీసీబీ నాకు ఇంకా వేల డాలర్ల బకాయి చెల్లించాలి: పాక్ మాజీ కోచ్ గెలెస్పీ