Share News

భారత్‌ ప్రత్యర్థి బంగ్లా

ABN , Publish Date - Sep 09 , 2026 | 05:02 AM

మహిళల టీ20 ఆసియాకప్‌ సెమీఫైనల్లో భారత జట్టు ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. మంగళవారం గ్రూప్‌ ‘బి’లో..

భారత్‌ ప్రత్యర్థి బంగ్లా

యూఏఈపై గెలిచి సెమీస్‌కు మహిళల ఆసియా కప్‌

దుబాయ్‌: మహిళల టీ20 ఆసియాకప్‌ సెమీఫైనల్లో భారత జట్టు ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. మంగళవారం గ్రూప్‌ ‘బి’లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టు 34 రన్స్‌ తేడాతో యూఏఈపై గెలిచింది. దీంతో నాలుగు పాయింట్లతో ఈ జట్టు సెమీ్‌సకు చేరింది. ఇక తుది పోరుకు అర్హత సాధించేందుకు గురువారం భారత్‌తో తలపడనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 103/7 స్కోరు సాధించింది. షర్మిన్‌ (38) టాప్‌ స్కోరర్‌. సురక్షకు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో యూఏఈ 20 ఓవర్లలో 69/9 స్కోరుకే పరిమితమై చిత్తుగా ఓడింది. హీన (18) మాత్రమే రాణించింది. రబేయాకు 3.. మరుఫ, నహిదాలకు రెండేసి వికెట్లు దక్కాయి.

Updated Date - Sep 09 , 2026 | 05:02 AM