Share News

అఫ్గాన్-భారత్ టీ20 సిరీస్.. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు టీవీ ప్రసార హక్కులు

ABN , Publish Date - Sep 08 , 2026 | 02:51 PM

టీమిండియా, అఫ్గానిస్థాన్‌ మధ్య ఆసక్తికర టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ సెప్టెంబరు 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన టెలివిజన్‌ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ దక్కించుకుంది.

అఫ్గాన్-భారత్ టీ20 సిరీస్.. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు టీవీ ప్రసార హక్కులు
India vs Afghanistan T20 series

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా, అఫ్గానిస్థాన్‌ మధ్య ఆసక్తికర టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ సెప్టెంబరు 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన టెలివిజన్‌ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ దక్కించుకుంది. దీంతో భారత్‌తో పాటు నేపాల్‌, మాల్దీవులు, భూటాన్‌లోని క్రికెట్‌ అభిమానులు సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ద్వారా మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ఉంది. కాగా మూడు మ్యాచ్‌లూ ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి.


భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. కాగా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సంబంధించిన వివరాలను అధికారిక ప్రసార సంస్థ ప్రకటించాల్సి ఉంది. ‘అఫ్గానిస్థాన్‌-భారత్‌ టీ20 సిరీస్‌తో సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ క్రికెట్‌ పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతమవుతోంది. ఇరు జట్లు దూకుడైన, వినోదాత్మక టీ20 క్రికెట్‌ ఆడతాయి. మూడు మ్యాచ్‌లు కూడా హోరాహోరీగా సాగుతాయని భావిస్తున్నాం’ అని సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా చీఫ్‌ రెవెన్యూ ఆఫీసర్‌, స్పోర్ట్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ హెడ్‌ రాజేశ్‌ కౌల్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్

Updated Date - Sep 08 , 2026 | 02:58 PM