Share News

ఐపీఎల్ 2027: ట్రేడ్ రూమర్లకు చెక్.. భవిష్యత్తుపై కేఎల్ రాహుల్ క్లారిటీ

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:21 PM

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ నుంచి రాహుల్ ట్రేడ్ అవుతాడంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ రూమర్లకు తాజాగా అతడు చెక్ పెట్టాడు.

ఐపీఎల్ 2027: ట్రేడ్ రూమర్లకు చెక్.. భవిష్యత్తుపై కేఎల్ రాహుల్ క్లారిటీ
KL Rahul

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ నుంచి రాహుల్ ట్రేడ్ అవుతాడంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ రూమర్లకు తాజాగా అతడు చెక్ పెట్టాడు. వచ్చే సీజన్‌లోనూ డీసీ తరఫునే ఆడనున్నట్లు పరోక్షంగా స్పష్టం చేశాడు. ఢిల్లీ కో-ఓనర్ చేసిన ఓ పోస్ట్‌కు రాహుల్ ఎక్స్‌లో రిప్లై ఇచ్చాడు.


ఢిల్లీ క్యాపిటల్స్‌ కో-ఓనర్‌ పార్థ్‌ జిందాల్‌.. రాహుల్‌ను ప్రశంసిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశాడు. ‘కేఎల్‌ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు క్లచ్‌ ప్లేయర్‌. నాకు తెలిసిన అత్యంత మంచి వ్యక్తుల్లో అతడొకడు. ఎప్పుడూ తనకంటే జట్టుకే ప్రాధాన్యం ఇస్తాడు. మనకు ఇంకా పూర్తి చేయాల్సిన పని చాలా ఉంది. కలిసి కష్టపడి ఢిల్లీని గర్వపడేలా చేద్దాం” అంటూ జిందాల్‌ రాసుకొచ్చాడు. దీనికి రాహుల్‌ స్పందిస్తూ.. ‘థ్యాంక్యూ.. వచ్చే సీజన్‌ కోసం ఎదురుచూస్తున్నా’ అని బదులిచ్చాడు. దీంతో 2027 సీజన్‌లోనూ రాహుల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ జెర్సీలోనే కనిపించనున్నాడని దాదాపు స్పష్టమైంది.


2025 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు రూ.14 కోట్లకు రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండు సీజన్లలోనూ అతడు అదరగొట్టాడు. 2025లో 539 పరుగులు చేసిన రాహుల్‌.. 2026 సీజన్‌లో 593 పరుగులు సాధించాడు. అంతకుముందు పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్‌.. ఆ తర్వాత మూడు సీజన్ల పాటు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.


హార్దిక్‌ ముంబైలోనే?

మరోవైపు ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య విషయంలోనూ ట్రేడ్‌ ఊహాగానాలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్దిక్‌ను మరో ఫ్రాంచైజీకి పంపేందుకు చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని తెలుస్తోంది. హార్దిక్‌కు సరైన డీల్‌ దొరకకపోవడంతో అతడు 2027 సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ముంబై జట్టులో కెప్టెన్సీ మార్పు మాత్రం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కెప్టెన్సీకి సంబంధించిన నిర్ణయ ప్రక్రియలో రోహిత్‌ శర్మ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్

Updated Date - Sep 08 , 2026 | 12:24 PM