గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:24 AM
భారత స్టార్ యువ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు.షేర్-ఏ-పంజాబ్ టీ20 లీగ్‌లో ఫజిల్కా ఫాల్కన్స్, అమృత్‌సర్ సూర్మాస్ మ్యాచ్‌లో ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు నడిచింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ యువ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. పంజాబ్ క్రికెట్ క్లబ్ నుంచే ఎదిగిన ఈ ఇద్దరూ.. షేర్-ఏ-పంజాబ్ టీ20 లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఫజిల్కా ఫాల్కన్స్, అమృత్‌సర్ సూర్మాస్ మ్యాచ్‌లో ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు నడిచింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అభిషేక్ శర్మ బౌలింగ్‌లో గిల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. పదో ఓవర్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన గిల్.. ఆ తర్వాతి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఐదో బంతికి మరోసారి సిక్స్ కొట్టి ఓవర్‌లో 6, 4, 6తో హోరెత్తించాడు. అయితే చివరి బంతికి అభిషేక్ అదిరిపోయే రీతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన గిల్.. బౌండరీ లైన్ వద్ద ఉన్న నమన్ ధీర్ చేతికి చిక్కాడు. దీంతో 35 బంతుల్లో 67 పరుగుల వద్ద గిల్ పెవిలియన్ చేరాడు. ఫజిల్కా ఫాల్కన్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది.
అభిషేక్ విధ్వంసం!
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమృత్‌సర్‌కు అభిషేక్ శర్మ, సహజ్ ధావన్ శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 79 పరుగులు జోడించారు. అభిషేక్ కేవలం 15 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఫజిల్కా బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీసినప్పటికీ.. అమృత్‌సర్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచ కప్ ఆడతారని చెప్పడం తొందరపాటు: ఆశిష్ నెహ్రా
బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయి.. రెండేళ్లు వెనక్కి వెళ్లి కష్టపడ్డా: ఇషాన్ కిషన్