Home » Bhatti Vikramarka Mallu
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఇంజనీర్ల సూచనల మేరకు నిర్మించి ఉంటే దెబ్బతినేవి కాదని, కేసీఆర్ ఇంజనీర్ అవతారమెత్తి తప్పుడు పద్ధతుల్లో కట్టడం వల్లే లక్ష కోట్లు ఖర్చు చేసినాఆ ప్రాజెక్టు ఎందుకూ కొరగాకుండాపోయిందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.
ప్రజలకవసరమైన సహాయ సహకారాలందిస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు తమ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విద్య ద్వారానే మెరుగుపడ్డ తెలంగాణ నేడు ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ, మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటునందిస్తుంది.
ఏపీలోని కర్నూలు జిల్లాలో నిర్మితమవుతోన్న పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దీనికి ఏపీని అభినందిస్తున్నానని ఆయన అన్నారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని, ఇప్పుడిప్పుడే గాడినపడుతోందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక కరువు భత్యాన్ని(డీఏ) వెంటనే, మరొక డీఏను వచ్చే ఏప్రిల్‌లో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని, సప్లిమెంటరీ బిల్లులన్నీ ఒకే దఫాలో చెల్లించాలని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరింది.