Share News

Mallu Bhatti Vikramarka: ప్రతి పైసా ప్రజలకు ఖర్చు పెట్టాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ABN , Publish Date - Dec 27 , 2025 | 08:54 PM

నేలకొండపల్లి మండలం అనంతనగర్‌లో జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ధనిక రాష్ట్రంలో సంపదను గత పాలకులు పంచకుండా అప్పులు చేశారని, పది సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు.

Mallu Bhatti Vikramarka: ప్రతి పైసా ప్రజలకు ఖర్చు పెట్టాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Mallu Bhatti Vikramarka comments

ధనిక రాష్ట్రంలో సంపదను గత పాలకులు పంచకుండా అప్పులు చేశారని, పది సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలం అనంతనగర్‌లో జరిగిన సభలో భట్టి పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వం 65 శాతం ఉచిత విద్యుత్ అందిస్తోందని అన్నారు (Telangana Deputy CM speech).


ప్రజల అవసరాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రైతుల కోసం 12, 500 కోట్ల రూపాయలను విద్యుత్ శాఖకు ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వడం ఏ దేశంలోనూ లేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెపితేనే గత పాలకులకు ప్రజలు ఓట్లేశారని, కానీ పేదలకు ఒక్క ఇల్లు కూడా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు (Bhatti Vikramarka latest remarks).


ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని (Telangana politics news), మంచి చేశారనే కారణంతోనే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 75 శాతం కాంగ్రెస్ సర్పంచ్‌లను ప్రజలు గెలిపించారని అన్నారు. ప్రతి పైసా ప్రజలకు ఖర్చు పెట్టాలనేదే ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశమని, ప్రజలు ఆశించినట్లుగానే రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

టీమిండియా టెస్ట్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్? డేంజర్‌లో గంభీర్ పదవి!

అడవిలో గడ్డి కోస్తుండగా ఊహించని విషాదం..

Updated Date - Dec 27 , 2025 | 08:54 PM