Gautam Gambhir: టీమిండియా టెస్ట్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్? డేంజర్‌లో గంభీర్ పదవి!
ABN , Publish Date - Dec 27 , 2025 | 08:19 PM
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై గత కొంత కాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన ఓ కొత్త విషయం బయటికి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై గత కొద్ది రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాపై టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వడంతో అతడిని ఆ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే అతడి మార్గదర్శకత్వంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు మెరుగైన ఫలితాలే సాధించింది. కానీ టెస్టుల్లో మాత్రం పేలవ ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో గంభీర్(Gautam Gambhir)కి సంబంధించి ఓ కొత్త విషయం బయటికొచ్చింది.
టీమిండియా టెస్టు జట్టుకు కోచ్ ఉండేందుకు వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman)తో బీసీసీఐ అధికారి ఒకరు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. వాస్తవానికి కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన లక్ష్మణ్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలనుకున్నారు. అయితే, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ‘హెడ్ ఆఫ్ క్రికెట్’గా ఉండటం సంతోషంగా ఉందని లక్ష్మణ్ తెలిపాడు.
గంభీర్ (Gautam Gambhir) పదవీకాలం 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఉంది. 2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు ప్రదర్శనను బట్టి కోచ్ పదవిపై తిరిగి సమీక్షించే అవకాశం ఉంది. ‘భారత క్రికెట్‌లోని అధికార వర్గాల్లో గంభీర్‌కు బలమైన మద్దతు ఉంది. వచ్చే టీ20 ప్రపంచ కప్‌ను భారత్ తిరిగి నిలబెట్టుకోవడం లేదా కనీసం ఫైనల్‌కు చేరినా తన పదవీకాలాన్ని సజావుగా పూర్తి చేసుకుంటాడు. ఒకవేళ టీ20 ప్రపంచ కప్‌లో ఏదైనా తేడా కొట్టి.. అప్పుడు కూడా గంభీర్ కోచ్‌గా కొనసాగితే అనంతర పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. వీవీఎస్ లక్ష్మణ్ సీనియర్ టెస్టు జట్టుకు కోచ్‌గా వ్యవహరించడానికి ఆసక్తి చూపలేదు. వేరే ప్రత్యామ్నాయాలు ఎక్కువ లేకపోవడం గంభీర్‌కు కలిసొచ్చే అంశం’ అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో అన్నారు.
ఇవి కూడా చదవండి
తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!
ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్