Virat Kohli: తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:57 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తు్న్న కోహ్లీ.. గుజరాత్‌తో మ్యాచులో 77 పరుగుల వద్ద ఔటయ్యాడు. తన వికెట్ తీసుకున్న బౌలర్ విశాల్‌కు విరాట్ గిఫ్ట్ ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తు్న్న విరాట్.. ఆంధ్రా జట్టుతో జరిగిన తొలి మ్యాచుల సెంచరీ(131)తో చెలరేగాడు. గుజరాత్-ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచులో హాఫ్ సెంచరీ(77) నమోదు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అయితే తొలి మ్యాచు(Vijay Hazare Trophy)లో సెంచరీ చేసి జోరు మీదున్న కోహ్లీ(Virat Kohli).. గుజరాత్‌తో మ్యాచులోనూ శతకం బాదేస్తాడనే అనుకున్నారంతా. కానీ స్పిన్నర్ విశాల్ జైస్వాల్ అద్భుతమైన బంతి సంధించి కోహ్లీని పెవిలియన్ పంపాడు.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తన వికెట్ తీసిన విశాల్ జైస్వాల్(Vishal Jaiswal )కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. బంతిపై ఆటోగ్రాఫ్ చేయడంతో పాటు.. అతడితో ఫొటో దిగాడు. ఈ ఫొటోలను విశాల్ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నాడు. ‘అతడి ఆటను టీవీలో చూసినప్పటి నుంచి అతడితో మైదానం పంచుకున్నప్పటి వరకు.. గ్రేట్ ఫుల్ మూమెంట్స్’ అంటూ ఆ పోస్ట్ కింద రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లోనే 53వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అలాగే తాను విరాట్ వికెట్ తీసుకున్న బౌలింగ్ వీడియోనూ కూడా జైస్వాల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దానికి ఏకంగా 2.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో అతడు 42 పరుగులిచ్చి 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
హర్మన్ ప్రీత్ ప్రపంచ రికార్డు.. అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా..!
దాదాపు 15 ఏళ్ల తర్వాత.. ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ ఘన విజయం