Share News

The Ashes: దాదాపు 15 ఏళ్ల తర్వాత.. ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ ఘన విజయం

ABN , Publish Date - Dec 27 , 2025 | 02:24 PM

యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో తలపడ్డాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్.. ఆసీస్ గడ్డపై ఘన విజయం సాధించింది. ఈ ఆట రెండు రోజుల్లోనే ముగియడం గమనార్హం.

The Ashes: దాదాపు 15 ఏళ్ల తర్వాత.. ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ ఘన విజయం
The Ashes

ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో తలపడ్డాయి. ఇప్పటికే మూడు టెస్టుల్లో ఓడి.. సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ ఈ బాక్సింగ్ డే(The Ashes) టెస్టులో 4 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డ మీద దాదాపు 15 ఏళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ ఈ విజయం సాధించడం గమనార్హం. 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో క్రాలీ(37), బెన్ డకెట్(34) జట్టుకు శుభారంభాన్ని అందించారు. జాకబ్ బెథెల్(40) రాణించాడు. బ్రైడన్ కార్స్(6), జో రూట్(15), బెన్ స్టోక్స్(2) బ్యాటింగ్‌లో మరోసారి విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్(2*), జెమీ స్మిత్(3*) నాటౌట్‌గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్, రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.


తొలుత 4/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. 34.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌కు 175 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(46) ఒక్కడు రాణించాడు. స్కాట్‌ బోలాండ్‌ 6, జేక్ వెదర్లాడ్‌ 5, లబుషేన్‌ 8, ఉస్మాన్‌ ఖవాజా 0, కామెరూన్‌ గ్రీన్‌ 19, మైఖేల్‌ నీసర్‌ 0, మిచెల్‌ స్టార్క్‌ 0, రిచర్డ్‌సన్‌ 7.. బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. స్టీవ్‌ స్మిత్‌ 24* నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ 4, జోష్‌ టంగ్‌, బెన్‌స్టోక్స్‌ తలో 2, గస్‌ అట్కిన్సన్‌ 1 వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 7 వికెట్లు తీసుకున్న జోష్‌ టంగ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలిరోజు ఆటలో 20 వికెట్లు నేలకూలిన విషయం తెలిసిందే. అలాగే రెండో రోజు ఆటలో బౌలర్లు 16 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన బ్యాటర్లెవరూ కనీసం హాఫ్‌ సెంచరీ సాధించలేకపోవడం గమనార్హం.


ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

Vignesh Puthur Creates History: 32 ఏళ్ల రికార్డ్ బద్దలు.. చరిత్ర సృష్టించిన విజ్ఞేష్

Updated Date - Dec 27 , 2025 | 02:24 PM