Share News

Boxing Day Test: తొలి రోజే 20 వికెట్లు

ABN , Publish Date - Dec 27 , 2025 | 02:49 AM

ఇప్పటికే యాషెస్‌ సిరీ్‌సను 0-3తో కోల్పోయిన ఇంగ్లండ్‌.. నాలుగో టెస్ట్‌లో సత్తా చాటేందుకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేక పోయింది. పిచ్‌పై 10 మిల్లీ మీటర్ల మేర ఉన్న పచ్చికకు...

Boxing Day Test: తొలి రోజే 20 వికెట్లు

యాషెస్‌ నాలుగో టెస్ట్‌

బాక్సింగ్‌డే టెస్టులో పేసర్లకు పండుగ

  • ఆస్ట్రేలియా 152

  • ఇంగ్లండ్‌ 110

మెల్‌బోర్న్‌: ఇప్పటికే యాషెస్‌ సిరీ్‌సను 0-3తో కోల్పోయిన ఇంగ్లండ్‌.. నాలుగో టెస్ట్‌లో సత్తా చాటేందుకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేక పోయింది. పిచ్‌పై 10 మిల్లీ మీటర్ల మేర ఉన్న పచ్చికకు మబ్బు పట్టిన వాతావరణం తోడవడంతో ఇరుజట్ల పేసర్లు చెలరేగారు. ఫలితంగా బాక్సింగ్‌ డే టెస్ట్‌ మొదటి రోజే 20 వికెట్లు నేలకూలాయి. ఇక, ఈ వికెట్ల వేటలో ఆతిథ్య ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్ట్‌లో టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 45.2 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. చాలాకాలం తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన మైకేల్‌ నేసర్‌ (35) టాప్‌ స్కోరర్‌. ఉస్మాన్‌ ఖవాజా (29), కేరీ (20) పర్లేదనిపించారు. జోష్‌ టంగ్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు. అయితే ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే అలౌట్‌ చేయడంతో సిరీ్‌సలో మొదటిసారి టెస్ట్‌ గెలిచేందుకు వచ్చిన అవకాశాన్ని ఇంగ్లండ్‌ సద్వినియోగం చేసుకోలేకపోయింది. నేసర్‌, బోలాండ్‌ దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 110 పరుగులకే కుప్పకూలింది. 4/16తో తీవ్ర ఇక్కట్లలో పడగా..బ్రూక్‌ (41), స్టోక్స్‌ (16) ఐదో వికెట్‌కు 50 పరుగులు జోడించడంతో ఒకింత తేరుకుంది. అయితే ఆ తర్వాత బ్రూక్‌, స్మిత్‌, జాక్స్‌, స్టోక్స్‌ వరుసగా పెవిలియన్‌కు చేరడంతో ఇంగ్లండ్‌ ఒక్కసారిగా కుదేలైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ఆఖరికి వికెట్‌ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 42 పరుగులతో కలిపి కంగారూలు మొత్తంగా 46 రన్స్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 152 (నేసర్‌ 35, ఖవాజా 29, కేరీ 20, గ్రీన్‌ 17, జోష్‌ టంగ్‌ 5/45, అట్కిన్సన్‌ 2/28); ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 110 (బ్రూక్‌ 41, అట్కిన్సన్‌ 28, స్టోక్స్‌ 16, నేసర్‌ 4/45, బోలాండ్‌ 3/30, స్టార్క్‌ 2/23); ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 4/0 (బోలాండ్‌ బ్యాటింగ్‌ 4, హెడ్‌ బ్యాటింగ్‌ 0).

94,119

మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో నాలుగో టెస్ట్‌ మొదటి రోజు హాజరైన ప్రేక్షకులు. 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇక్కడ జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ రికార్డు (93,013)ను తిరగ రాసింది.

20

మెల్‌బోర్న్‌లో యాషెస్‌ టెస్ట్‌ మ్యాచ్‌ తొలి రోజు అత్యధిక వికెట్లు (20) పడడం 1901-02 తర్వాత ఇదే తొలిసారి.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

Vignesh Puthur Creates History: 32 ఏళ్ల రికార్డ్ బద్దలు.. చరిత్ర సృష్టించిన విజ్ఞేష్

Updated Date - Dec 27 , 2025 | 02:49 AM