Vignesh Puthur Creates History: 32 ఏళ్ల రికార్డ్ బద్దలు.. చరిత్ర సృష్టించిన విజ్ఞేష్
ABN , Publish Date - Dec 26 , 2025 | 07:58 AM
విజయ్ హజారే టోర్నీ2025-26లో భాగంగా బుధవారం త్రిపుర, కేరళ మధ్య మ్యాచ్ జరిగింది. కేరళ జట్టు తరఫున విజ్ఞేష్ పుతుర్ బరిలోకి దిగి.. ఉదియన్ బోస్, స్రిదమ్ పాల్, స్వప్నిల్ సింగ్, సౌరభ్ దాస్, అభజిత్ సర్కార్, వికీల క్యాచ్‌లు అందుకున్నాడు. మొత్తం 6 క్యాచ్‌లు అందుకొని ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో ఓ ఆటగాడు ఆరు క్యాచ్‌లు అందుకోవడం ఇదే ప్రథమం.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ వేలానికి ముందు చాలా మంది ప్లేయర్లను ఫ్రాంచైజీలు వదిలేశాయి. అలానే ముంబై ఇండియన్స్ కూడా యువ స్పిన్నర్ విజ్ఞేష్ పుతుర్(Vignesh Puthur) వదులుకుంది. అలా ముంబై వదిలేసిన ఈ యువ ఆటగాడు చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరుగని ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విజ్ఙేష్ పుతుర్ ఈ అరుదైన ఘనత సాధించడమే కాకుండా 32 ఏళ్ల రికార్డును బద్దల కొట్టాడు. ఇక వివరాల్లోకి వెళ్తే..
విజయ్ హజారే టోర్నీ( Vijay Hazare Trophy)2025-26లో భాగంగా బుధవారం త్రిపుర, కేరళ మధ్య మ్యాచ్ జరిగింది. కేరళ జట్టు తరఫున విజ్ఞేష్ పుతుర్ బరిలోకి దిగి.. ఉదియన్ బోస్, స్రిదమ్ పాల్, స్వప్నిల్ సింగ్, సౌరభ్ దాస్, అభజిత్ సర్కార్, వికీల క్యాచ్‌లు అందుకున్నాడు. మొత్తం 6 క్యాచ్‌లు అందుకొని ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో ఓ ఆటగాడు ఆరు క్యాచ్‌లు అందుకోవడం ఇదే ప్రథమం. ఇప్పటి వరకు లిస్ట్-ఏ క్రికెట్‌లో ఓ ఆటగాడు 5 క్యాచ్‌లు అందుకోవడమే రికార్డు.1993లో సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 5 క్యాచ్‌లు అందుకున్నాడు. ఆ తర్వాత 2002లో బ్రాడ్ యంగ్, 2023లో హాండ్‌స్కోంబ్, 2025లో అరీన్ సంగ్మా, హ్యారీ బ్రూక్ ఈ రికార్డ్‌ను సమం చేశారు. 32 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డ్‌ను విజ్ఞేష్ పుతుర్(Vignesh Puthur) మాత్రం తాజాగా 6 క్యాచ్‌ల అందుకుని బ్రేక్ చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే..ముందుగా బ్యాటింగ్ చేసిన కేరళ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 348 పరుగుల భారీ స్కోర్ చేసింది. విష్ణు వినోద్(102) శతకం చేయగా.. బాబా అపరజిత్(64) అర్ధ శతకంతో రాణించాడు. అలానే రోహన్(94) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అనంతరం త్రిపుర 36.5 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది. దీంతో కేరళ 145 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బాబా అపరజిత్ 5 వికెట్లు తీసి కేరళ విజయం కీలక పాత్ర పోషించాడు. అలానే విజ్ఞేష్ పుతుర్(Vignesh Puthur) కూడా ఒక వికెట్ సాధించాడు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..