Share News

India Womens Cricket: సిరీస్‌పై గురి

ABN , Publish Date - Dec 26 , 2025 | 06:27 AM

వరుస విజయాలతో జోరుమీదున్న భారత మహిళల జట్టు.. సిరీ్‌సపై గురి పెట్టింది. శుక్రవారం శ్రీలంతో జరిగే మూడో టీ20లో భారత్‌ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. 2-0తో ఆధిక్యంలో...

India Womens Cricket: సిరీస్‌పై గురి

రాత్రి 7 గం.నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

జోష్‌లో భారత్‌

మహిళల మూడో టీ20 నేడు

ఒత్తిడిలో లంక

తిరువనంతపురం: వరుస విజయాలతో జోరుమీదున్న భారత మహిళల జట్టు.. సిరీ్‌సపై గురి పెట్టింది. శుక్రవారం శ్రీలంతో జరిగే మూడో టీ20లో భారత్‌ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. 2-0తో ఆధిక్యంలో ఉన్న హర్మన్‌ప్రీత్‌ సేన.. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సను మరో రెండు మిగిలుండగానే పట్టేయాలనుకొంటోంది. భారత బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. రెండో మ్యాచ్‌లో షఫాలీ వర్మ అదరగొడితే.. తొలి టీ20లో జెమీమా ఆదుకొంది. అయితే, డాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన బ్యాట్‌ నుంచి ఆశించిన రీతిలో పరుగులు రావడం లేదు. కెప్టెన్‌ హర్మన్‌కు కూడా పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు. అయితే, గడచిన రెండు మ్యాచ్‌ల్లో మన బౌలర్లు ప్రత్యర్థిని 121/6, 128/9 స్కోర్లకే పరిమితం చేశారు. యువ స్పిన్నర్లు శ్రీచరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్‌ కట్టుదిట్టంగా బంతులేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన స్నేహ్‌ రాణా కూడా పొదుపుగా బౌలింగ్‌ చేసి లంక బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టింది. తొలి మ్యాచ్‌తో పోల్చితే మనోళ్ల ఫీల్డింగ్‌ మెరుగుపడుతోంది. మొదటి మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు చేజార్చిన భారత ప్లేయర్లు.. రెండో టీ20లో మూడు రనౌట్లు చేయడం విశేషం. సిరీ్‌సలో మిగిలిన మూడు మ్యాచ్‌లు ఇక్కడే జరగనుండడం భారత్‌కు సానుకూలాం శమే. ఇక దీప్తిశర్మ ఫిట్‌నె్‌సపై ఎలాంటి సమాచారం లేదు.

గెలిచి నిలవాలని..

మరోవైపు తీవ్ర ఒత్తిడిలో ఉన్న లంక.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సజీవంగా ఉంచాలనుకుంటోంది. అయితే, టీమ్‌ బ్యాటింగ్‌ ఘోరంగా విఫలమవుతోంది. రెండు మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక పోరాడగలిగే స్కోరునైతే సాధించలేకపోయింది. ఆరంభంలో ఫర్వాలేదనిపించినా.. ఒకట్రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలుతోంది. కెప్టెన్‌ చమరి ఆటపట్టు ఉన్నంత వరకు దూకుడుగా ఆడుతున్నా.. విష్‌మి గుణరత్నే, హాసిని పెరీరా, హర్షిత స్కోరు బోర్డును పరుగులు పెట్టించలేక పోతున్నారు. వికెట్ల మధ్య పరిగెత్తుతున్న తీరు కూడా దారుణంగా ఉంది. ఇక, బౌలర్లు భారత బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బందిపెట్టలేక పోతున్నారు.


జట్లు (అంచనా)

భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), స్నేహ్‌ రాణా/దీప్తి, అమన్‌జోత్‌ కౌర్‌, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్‌, వైష్ణవి శర్మ, శ్రీచరణి.

శ్రీలంక: చమరి ఆటపట్టు (కెప్టెన్‌), విష్‌మి గుణరత్నె, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి, కౌషిని నుత్యాంగన (వికెట్‌ కీపర్‌), కవిష దిల్హారి, మాల్కి మదార, ఇనోక రణవీర, క్వాయ కవింది, షాషిని గిమ్హని.

పిచ్‌/వాతావరణం

వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో ఆడిన నాలుగు టీ20ల్లో మూడుసార్లు ఛేదన చేసిన జట్లే నెగ్గాయి. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకోవచ్చు. ఆకాశం మేఘావృతమై ఉన్నా.. వర్షం కురిసే అవకాశాలు తక్కువ.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..

Updated Date - Dec 26 , 2025 | 06:28 AM