Share News

Hindu Man Lynched: బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..

ABN , Publish Date - Dec 25 , 2025 | 08:22 PM

దీపు చంద్రదాస్ సంఘటన నుంచి తేరుకోకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. మరో హిందువు బంగ్లాదేశ్‌లో ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం రాత్రి ఓ హిందూ యువకుడిపై కొంతమంది దాడి చేసి చంపేశారు.

Hindu Man Lynched: బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..
Hindu Man Lynched

బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అక్కడి హిందువులు బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. కొంతమంది దుర్మార్గులు అక్కడి హిందువుల్ని హింసలకు గురి చేయటమే కాకుండా దారుణంగా చంపేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దీపు చంద్రదాస్ అనే యువకుడిని దైవ దూషణ చేశాడని ఆరోపిస్తూ దారుణంగా కొట్టి చంపేశారు. అతడి శవాన్ని చెట్టుకు వెలాడదీసి తగులబెట్టారు. ఈ సంఘటన నుంచి తేరుకోకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. మరో హిందువు బంగ్లాదేశ్‌లో ప్రాణాలు కోల్పోయాడు.


సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ్‌భరీలోని హోసయ్‌దంగ గ్రామానికి చెందిన 29 ఏళ్ల అమ్రిత్ మండల్ అలియాస్ సామ్రాట్ అనే యువకుడిపై బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో హోసయ్‌దంగ మార్కెట్లో కొంతమంది దాడి చేశారు. అందరూ కలిసి కొట్టి చంపేశారు. సంఘటన గురించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అమ్రిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. స్థానికులను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నాడనే కారణంతోటే అతడ్ని కొట్టి చంపేసినట్లు పోలీసులు చెబుతున్నారు.


సామ్రాట్ ‘సామ్రాట్ బాహిని’ అనే గ్రూపునకు నాయకుడిగా ఉన్నాడని తెలిపారు. అతడి పేరు తమ పోలీస్ రికార్డులలో కూడా ఉందని అన్నారు. ఇక, ఈ సంఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తు మొదలెట్టారు. నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. ఏ కారణంతో సామ్రాట్ హత్య జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనతో మరోసారి స్థానిక హిందువుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.


ఇవి కూడా చదవండి

వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. మొసలిని ఎలా కనిపెట్టాడో చూడండి..

శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం..

Updated Date - Dec 25 , 2025 | 08:22 PM