Share News

Shankara Nethralaya USA event: శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం..

ABN , Publish Date - Dec 25 , 2025 | 07:58 PM

శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్లాసెంటియా నగరం వాలెన్సియా హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన లైట్ మ్యూజిక్ కచేరీ మంచి ఆదరణ దక్కించుకుంది.

Shankara Nethralaya USA event: శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం..
Shankara Nethralaya charity event

శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్లాసెంటియా నగరం వాలెన్సియా హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన లైట్ మ్యూజిక్ కచేరీ మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ సంగీత కార్యక్రమంలో ప్రముఖ గాయకులు సుమంగళి, అంజనా సౌమ్య, పార్థు నేమాని, మల్లికార్జున్ పాల్గొని మూడు గంటలకు పైగా మధుర గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు (Shankara Nethralaya Los Angeles chapter).


నిధులు సేకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ప్రైమ్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రేమ్ రెడ్డి ముఖ్య అతిథిగా, లాస్ ఏంజెలెస్‌లో భారత దేశ కాన్సుల్ జనరల్ కేజే శ్రీనివాస గౌరవ అతిథిగా పాల్గొన్నారు. లక్షలాది మందికి చూపును తిరిగి ప్రసాదించాలనే శంకర నేత్రాలయ మహత్తర లక్ష్యం దాతలు, స్పాన్సర్ల ఉదార సహకారంతోనే సాధ్యమవుతోంది. ఈ సందర్భంగా లాస్ ఏంజెలెస్‌కు చెందిన ఎమ్‌ఈఎస్‌యూ స్పాన్సర్లు శరత్ కామినేని, శ్యామ్ కునాం, కృష్ణ రెడ్డి, గౌతమ్ నెల్లుట్ల, దాతలు లక్ష్మీ, త్రినాథ్ గొటేటి, మల్లిక్ కేశవరాజు, డాక్టర్లు మురళి, స్వర్ణ చందూరి, శివనాథ్ పరానండిలను డా. ప్రేమ్ రెడ్డి సన్మానించి వారి సేవలను కొనియాడారు (LA chapter program success).


ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాన్సుల్ జనరల్ కేజే శ్రీనివాస మాట్లాడుతూ.. భారతదేశం, ప్రస్తుతం నివసిస్తున్న దేశం మధ్య సానుకూల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ ప్రవాసుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. అలాగే ప్రేమ్ రెడ్డి మాట్లాడుతూ.. శంకర నేత్రాలయ సేవలను ప్రశంసించారు. మరింత మంది సమాజ సభ్యులు ఈ మహత్తర కార్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే పలు కంటి వైద్య శిబిరాల నిర్వహణను స్వయంగా ప్రకటించారు (Shankara Nethralaya charity event).

losangles2.jpg


ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ అప్పల్లి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మల్లిక్ బండ, పబ్లిసిటీ చైర్ ప్రసాద్ రాణి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి సిరిగిరి, చాప్టర్ లీడ్స్ ప్రీతి, భాస్కర్, వెంకట్ పోలూ, నాగరాజ ఎమగౌడ, సతీష్ తొట్టెంపూడి, శ్రవణ్ నయ్యాటితో పాటు వాలంటీర్లు శ్రీని సిరిగిరి, శంకర్ చాపా, విష్ణు కల్వకూరు, చంద్ర వెంపాటి, అమర్ బుడగమంట్ల, శారద్ర వాయినేని, మహేష్ కపడమ్, మోహన్, అనిత కత్రగడ్డ, అనిత, నవీన్, అనిత భూమండ్ల, నరేష్ మసారం, సురేష్ బొండా తదితరులు విశేష కృషి చేశారు (Indian community Los Angeles).


ఈ సందర్భంగా శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి, మూర్తి రేకపల్లి, రెడ్డి ఉరిమింది, వంశీ ఎరువరం, రత్నకుమార్ కావుటూరు, గిరి కోటగిరి, గోవర్ధన్ రావు నిడిగంటిలకు చాప్టర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది (eye care initiative USA). ఈ కార్యక్రమానికి జీరెడ్డి ప్రసాద్, వెంకు రెడ్డి, నంద కుమార్ తిరువైపతి, డాక్టర్లు సావిత్రి, కమలాకర్ రాంభట్ల, గీతా, వెంకట్, రాధా శర్మ, సేరిటోస్ కమిషనర్ అశోక్ పట్నాయక్, ఏఐజీ హాస్పిటల్స్‌కు చెందిన రాకేష్ కలపాల వంటి ప్రముఖులు హాజరయ్యారు. అలాగే తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా అధ్యక్షుడు సీతారామ్ పమ్మిరెడ్డి, అధ్యక్షుడు-ఎలెక్ట్ కొండల వాయినేని, మాజీ అధ్యక్షుడు అనిల్ అర్రబెల్లి పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం www.SankaraNethralayaUSA.org వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

నిరాశ వదిలించి...నవజీవనం వైపు

Updated Date - Dec 25 , 2025 | 08:04 PM