Rohit Sharma In Vijay Hazare Trophy: రోహిత్.. వడాపావ్ తింటావా
ABN , Publish Date - Dec 26 , 2025 | 06:16 AM
విజయ్ హజారే ట్రోఫీలో ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ (155) ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. జైపూర్‌లో సిక్కింతో జరిగిన ఈ మ్యాచ్ వీక్షణకు భారీగా...
హిట్‌మ్యాన్‌తో ఫ్యాన్స్ సరదా
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీలో ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ (155) ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. జైపూర్‌లో సిక్కింతో జరిగిన ఈ మ్యాచ్ వీక్షణకు భారీగా అభిమానులు హాజరయ్యారు. అయితే, రోహిత్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. ‘ముంబై రాజా’ అంటూ హిట్‌మ్యాన్‌ను ఉద్దేశించి ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ అభిమాని ఒక అడుగు ముందుకేసి.. ‘రోహిత్ భాయ్.. వడాపావ్ తింటావా?’ అంటూ ఆటపట్టించాడు. దీనికి రోహిత్.. తినను అన్నట్టుగా చేయి చూపిస్తూ సరదాగా స్పందించాడు. దీంతో ఫ్యాన్స్ బిగ్గరగా అరిచారు. ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..