Share News

PM Narendra Modi: క్రీడల్లో బంధుప్రీతికి తెరదించాం

ABN , Publish Date - Dec 26 , 2025 | 06:19 AM

PM Narendra Modi Highlights Fairness and Merit in Sports Selection

PM Narendra Modi: క్రీడల్లో బంధుప్రీతికి తెరదించాం

ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: క్రీడల్లో బంధుప్రీతి, ఎంపికల్లో అక్రమాలకు దశాబ్దం కిందట చరమగీతం పాడామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2014కు ముందు క్రీడల్లో ఇవి బాగా ఉండేవని, తమ ప్రభుత్వం వాటికి తెరదించడంతో పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులు కూడా తమ కష్టంతో ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతున్నారని చెప్పారు. గురువారం సన్సద్‌ ఖేలో మహోత్సవ్‌లో ఆయన మాట్లాడుతూ.. యువతలో క్రీడలపై ఆసక్తి కలిగించడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ‘ఈ కార్యక్రమంతో వేలాది మంది ప్రతిభావంతులు ఉనికిలోకి వస్తారు. ఈ ఖేలో ఉత్సవ్‌ క్రమంగా జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించనుంది. అలానే సమాజం ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకువస్తుంది. 2014కు ముందు క్రీడల బడ్జెట్‌ రూ.1200 కోట్ల కంటే తక్కువ ఉండేది. ఇప్పుడు రూ.3 వేల కోట్లకు పైగా ఉంది. ప్రతిభావంతులైన క్రీడాకారులకు వారి శిక్షణ ఖర్చుల నిమిత్తం నెలకు రూ.25 నుంచి 50 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం’ అని చెప్పారు. క్రీడాకారులు తమ గెలుపు కోసం మాత్రమే ఆడరని, దేశం కోసం, జాతి ప్రతిష్ట కోసం, మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు కష్టపడతారని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..

Updated Date - Dec 26 , 2025 | 06:19 AM