Mahboob Ali Zaki: కొద్దిసేపట్లో మ్యాచ్.. గ్రౌండ్‌లోనే కుప్పకూలిన కోచ్!
ABN , Publish Date - Dec 27 , 2025 | 05:18 PM
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ(59) మరణించారు. శనివారం సిల్హెట్ వేదికగా రాజ్‌షాహి రాయల్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు కొద్ది నిమిషాల ముందు మహబూబ్ అలీ మైదానంలోనే కుప్పకూలారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(BPL) ఫ్రాంచైజీ ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ(59) మరణించారు. శనివారం సిల్హెట్ వేదికగా రాజ్‌షాహి రాయల్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు కొద్ది నిమిషాల ముందు మహబూబ్ అలీ(Mahboob Ali Zaki) మైదానంలోనే కుప్పకూలారు.
వెంటనే ఫిజియోలు వచ్చి సీపీఆర్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజీషియన్ దేబాశిష్ చౌదరి ధ్రువీకరించారు. అయితే మరణాన్ని గల కచ్చితమైన కారణాలను వెల్లడించలేదు.
మైదానంలో ఉన్న ఆటగాళ్లు, అధికారులు విషయం తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే సిల్హెట్ టైటాన్స్, నోవాఖాలీ ఎక్స్‌ప్రెస్, చట్టోగ్రామ్ రాయల్స్ జట్లకు చెందిన ప్లేయర్లు, కోచ్‌లు తమ ప్రాక్టీస్ ఆపేసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన మృతి పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేసింది.
ఒక దిగ్గజ కోచ్‌గా..
బంగ్లాదేశ్ పేస్ బౌలింగ్ విభాగంలో జాకీ ఒక లెజెండరీ కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అండర్-19 వరల్డ్ కప్(2020)ను బంగ్లాదేశ్ సొంతం చేసుకోవడంలో బౌలింగ్ కోచ్‌గా ఆయనది కీలక పాత్ర. అదేవిధంగా టాస్కిన్ అహ్మద్, షోర్‌ఫుల్ ఇస్లాం వంటి స్టార్ పేసర్లు జాకీ కోచింగ్‌లోనే రాటు దేలారు. ఆయన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్‌గా, బౌలింగ్ యాక్షన్ రివ్యూ కమిటీ సభ్యుడిగా సేవలందించారు.
ఇవి కూడా చదవండి
తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!
ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్