అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ABN , Publish Date - Sep 09 , 2026 | 10:51 AM
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదన మేరకు హరీశ్ రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, అనిల్ జాదవ్, మాధవరం కృష్ణారావు, కోవా లక్ష్మీ, కొనికంటి మాణిక్ రావు, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడు, కేపీ వివేకానందను స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం శాసనసభ టీ బ్రేక్ నిమిత్తం వాయిదా పడింది.
ఈరోజు(బుధవారం) సభ మొదలైన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మహిళా సభ్యుల పట్ల పోలీసుల అనుచిత ప్రవర్తనకు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ, స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. దీంతో వారిని సెషల్ మొత్తం సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించగా.. స్పీకర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం శాసనసభ టీ బ్రేక్ నిమిత్తం వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి...
కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ‘శుద్ధి’పై అసెంబ్లీలో దుమారం.. బీఆర్ఎస్‌పై మంత్రి ఫైర్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరు సభ్య సమాజానికి అవమానకరం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And Telugu News