Home » Gaddam Prasad Kumar
సీఎం రేవంత్‌రెడ్డిని ఏకవచనంతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధ్వజమెత్తారు. ఏలేటి చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది.
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
తాను ప్రజాస్వామిక పద్ధతిలో సభ నడుపుతున్నానని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యానించారు. నిన్నటి సంఘటనతో తాను బీఆర్ఎస్ నేతలకు మైక్ ఇవ్వనని స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో ప్రసాద్‌ను పరామర్శించారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేస్తోంది. దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సభలో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి.. చేయలేదని అంటున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ బయట ఈరోజు జరిగిన ఘటనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వివరణ ఇచ్చారు. తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.