Telangana Assembly:జడ్జిమెంట్‌పై సస్పెన్స్.. ఆ ఆలోచనలో స్పీకర్..!
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:00 AM
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ(గురువారం) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు చెప్పనున్నారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్‌లపై తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్.
హైదరాబాద్, డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై (MLAs Disqualification Petitions) ఇవాళ(గురువారం) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Telangana Assembly Speaker Gaddam Prasad Kumar) తీర్పు చెప్పనున్నారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్‌లపై తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్. అయితే, దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై ఇంకా విచారణ పూర్తి కాలేదని తెలుస్తోంది. స్పీకర్ నోటీసులకు జవాబు ఇచ్చేందుకు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మరింత గడువు కోరారు.
ఈ క్రమంలో ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో జడ్జిమెంట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న(బుధవారం) ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీర్పు ఇచ్చారు స్పీకర్. మరో ముగ్గురు ఎమ్మెల్యేల కేసులో ఇవాళ జడ్జిమెంట్ ఇవ్వాలని స్పీకర్ నిర్ణయించారు. ఇప్పటి వరకు పిటిషనర్లకు స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు .
ఈ నేపథ్యంలోనే స్పీకర్ నోటీసులకు బుధవారం రాత్రి వివరణ ఇచ్చారు కడియం శ్రీహరి. ఆయన ఇచ్చిన సమాధానంపై రేపటి(శుక్రవారం) వరకు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ వివేకానంద గౌడ్‌కు నోటీసులు ఇచ్చారు స్పీకర్. అయితే, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపటితో సుప్రీంకోర్టు గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే ఐదుగురు ఎమ్మెల్యేల కేసులో ఒకేసారి జడ్జిమెంట్ ఇద్దామనే ఆలోచనలో స్పీకర్ ఉన్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ ఎమ్మెల్యేలకు, టీ న్యూస్‌కు కవిత నోటీసులు
హైదరాబాద్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో కాల్చి..
Read Latest Telangana News and National News