Share News

Kavitha: ఆ ఎమ్మెల్యేలకు, టీ న్యూస్‌కు కవిత నోటీసులు

ABN , Publish Date - Dec 12 , 2025 | 10:56 AM

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ స్యూస్‌లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు కవిత.

Kavitha: ఆ ఎమ్మెల్యేలకు, టీ న్యూస్‌కు కవిత నోటీసులు
Kalvakuntla Kavitha

హైదరాబాద్, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇవాళ(శుక్రవారం) లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు.


తనపై, తన భర్త అనిల్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ నోటీసులో తెలిపారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


కాగా, తెలంగాణ జాగృతి జనం బాట పేరిట కవిత విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కరం కోసమే జనం బాట చేపట్టినట్లు కవిత ప్రకటించారు. మొదటగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జనం బాట కార్యక్రమం చేపట్టిన కవిత ఇప్పుడు మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న(గురువారం) నగరంలోని మలక్‌పేట, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో పర్యటించారు కవిత.


స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను కవిత తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై షాకింగ్ కామెంట్స్ చేశారు కవిత. ఆమె చేసిన వ్యాఖ్యలకు మాధవరం కృష్ణారావు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కవిత నోటీసులు పంపించినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

అందుకే ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్స్: డీసీపీ రాజేశ్

Read Latest Telangana News and National News

Updated Date - Dec 12 , 2025 | 11:23 AM