Share News

DCP Rajesh: అందుకే ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్స్: డీసీపీ రాజేశ్

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:37 PM

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఈ సంవత్సరం సుమారు 20కు పైగా ఫేక్ బెదిరింపు కాల్స్, మెసేజెస్ వచ్చాయని శంషాబాద్ డీసీపీ రాజేశ్ తెలిపారు. ఫేక్ కాల్స్ మెయిల్స్‌పై దర్యాప్తు స్పీడ్ అప్ చేశామని పేర్కొన్నారు.

DCP Rajesh: అందుకే ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్స్: డీసీపీ రాజేశ్
Shamshabad DCP Rajesh

హైదరాబాద్, డిసెంబరు10 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు (Shamshabad Airport) ఇటీవల వరసగా రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శంషాబాద్ డీసీపీ రాజేశ్ (Shamshabad DCP Rajesh) ఇవాళ (బుధవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎయిర్ పోర్టుకు ఈ సంవత్సరం సుమారు 20కు పైగా ఫేక్ బెదిరింపు కాల్స్, మెసేజెస్ వచ్చాయని వివరించారు. ఫేక్ కాల్స్, మెయిల్స్‌పై దర్యాప్తు స్పీడప్ చేశామని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలతో ఫేక్ కాల్స్, మెయిల్స్‌పై కో ఆర్డినేట్ చేసుకుంటున్నామని తెలిపారు.


ఫేక్ కాల్స్ చేసిన వారిలో కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేసి.. రిమాండ్ చేశామని వెల్లడించారు. పట్టుబడ్డ వారు వ్యక్తిగత కారణాలతోనే కాల్స్ చేశామని చెబుతున్నారని అన్నారు. ఫియర్, టీజింగ్ యాక్టివిటీతో కొందరు బెదిరింపు కాల్స్ , మెయిల్స్ చేస్తున్నారని తెలిపారు.. ఇప్పటివరకు వచ్చిన కాల్స్ అన్ని దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చాయని వివరించారు..ఫేక్ కాల్స్, మెయిల్స్‌తో బెదిరింపులకు దిగిన వారిలో ఉగ్రవాద మూలాలు ఉన్నవారు లేరని స్పష్టం చేశారు శంషాబాద్ డీసీపీ రాజేశ్.


బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు ప్రయాణికులు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ప్రజలకు అండగా పోలీసులు, భద్రతా బలగాలు ఉన్నాయని ధైర్యం చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణికుల భద్రత కోసం పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఫేక్ కాల్స్, మెయిల్స్‌పై దర్యాప్తు కోసం సైబర్ క్రైమ్ నుంచి స్పెషల్ టెక్నికల్ టీంను డిప్లయ్ చేశామని శంషాబాద్ డీసీపీ రాజేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హరీశ్‌రావు కీలక లేఖ

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 10 , 2025 | 12:57 PM