Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:28 PM
హైదరాబాద్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాలాగూడ పీఎస్ పరిధి లాలాపేటలో డివైడర్‌ను కారు అత్యంత వేగంతో వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు యువకులు ఉండగా...
హైదరాబాద్, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల (Road Accident) నివారణపై ఎంతగానో అవగాహన కల్పిస్తున్నాయి. కొంతమంది వాహనదారులు అత్యంత వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆయా ఘటనల్లో వాహనదారులు మృతిచెందుతుండటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు పోలీసులు వెల్లడించారు.
లాలాగూడ పీఎస్ పరిధి లాలాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను కారు అత్యంత వేగంతో వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరు యువకులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ ఘటనలో మృతిచెందిన వారు మల్కాజ్‌గిరికి చెందిన హర్షిత్ రెడ్డి(22), చెంగిచర్లకు చెందిన శివమణి (23)గా గుర్తించారు. నలుగురు స్నేహితులు కీసర నుంచి తార్నాకాకు టిఫిన్ చేసేందుకు వెళ్తుండగా ఈఘటన జరిగింది. ఇవాళ(ఆదివారం) ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరగడంతో లాలాపేటలో ట్రాఫిక్ స్థంభించింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును పోలీసులు పక్కకు పెట్టి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హరీశ్‌రావు కీలక లేఖ
గాంధీ, నెహ్రూలపై బీజేపీ విష ప్రచారం.. జగ్గారెడ్డి ఫైర్
Read Latest Telangana News and National News