Share News

Jaggareddy: గాంధీ, నెహ్రూలపై బీజేపీ విష ప్రచారం.. జగ్గారెడ్డి ఫైర్

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:14 PM

రాహుల్ గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు కావాలని చెడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రధానిగా దేశంలో నెహ్రూ ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారని తెలిపారు.

Jaggareddy: గాంధీ, నెహ్రూలపై బీజేపీ విష ప్రచారం.. జగ్గారెడ్డి ఫైర్
Jaggareddy

హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ టార్గెట్‌గా బీజేపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ, నెహ్రూలపై విష ప్రచారం చేయాలని మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. గాంధీపై బీజేపీ నాయకులు విషప్రచారం చేస్తుంటే బీజేపీ నేతలపై ప్రజలు తిరగబడుతున్నారని.. దీంతో గాంధీనీ కాకుండా ఇప్పుడు నెహ్రూపై విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల్లోకి బ్యాంక్ సేవలు తీసుకువచ్చిందే ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు. చరిత్రను రూపుమాపాలని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ (శనివారం) గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు జగ్గారెడ్డి.


శాంతియుత పోరాటం చేశారు...

‘నెహ్రూ కుటుంబం ఎప్పుడూ కుట్రా రాజకీయాలు చేయలేదు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం కోసమే నెహ్రూ కుటుంబం పని చేసింది. దేశ ప్రజలు స్వేచ్ఛగా ఉండాలని నెహ్రూ కుటుంబం శాంతియుత పోరాటం చేసి స్వాతంత్య్రం తీసుకువచ్చారు. స్వాతంత్య్రం తీసుకువచ్చింది గాంధీనే.. ఇది చరిత్ర.. దీనిని ఎవరూ మార్చలేరు. అప్పుడు బీజేపీ లేదు కదా అందుకే నెహ్రూ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు. నెహ్రూ ప్రధాని కావాలని స్వాతంత్య్రం పోరాటం చేయలేదు. నెహ్రూ ప్రధానిగా ఉండాలని ప్రజలు కోరుకున్నారు. ఆయన ప్రధాని అయిన తర్వాత ప్రణాళిక బద్దంగా ఆర్థిక పురోగతికి ప్రాధాన్యం ఇచ్చారు’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.


రాహుల్ గాంధీ కుటుంబంపై చెడు ప్రచారం...

‘లౌకిక వాదాన్ని నెహ్రూ విశ్వసించేవారని.. వారి త్యాగాలను మరిపించడానికి బీజేపీ నేతలు చెడు ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ కుటుంబంపై కావాలని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రధానిగా దేశంలో నెహ్రూ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. అప్పుడు ప్రజలు ఏక తీర్మానంతో నెహ్రూను ప్రధానిగా ఉండాలని చెప్పారు. ఇప్పుడు రెండు పర్యాయాలు ఓటింగ్ మిషన్‌లు తమంతట తాము ఓటు వేసుకున్నాయి. అందుకే బీజేపీ అధికారంలోకి వస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో నెహ్రూ హయాంలో ఆకలి చావులు లేకుండా చేశారు. తాగు, సాగు నీరు ప్రజలకు అందించడం కోసం దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులను నెహ్రూ నిర్మించారు’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Adilabad News: కౌటాలలో పులి అడుగులు గుర్తింపు

GP Elections: గెలుపే టార్గెట్... రంగంలోకి పార్టీ పెద్దలు

Updated Date - Dec 06 , 2025 | 04:39 PM