Share News

GP Elections: గెలుపే టార్గెట్... రంగంలోకి పార్టీ పెద్దలు

ABN , Publish Date - Dec 06 , 2025 | 10:11 AM

గెలుపే టార్గెట్‌గా ప్రధాన పార్టీల నేతలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. గ్రామ పంచాయతీల ఎన్నికలను అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారుతున్నాయి. పార్టీరహిత ఎన్నికలు అయినా పరోక్షంగా ప్రధాన పార్టీల మద్దతుదారులే పోటీ పడుతున్నారు.

GP Elections: గెలుపే టార్గెట్... రంగంలోకి పార్టీ పెద్దలు

- మద్దతుదారుల గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు

- సీఎం పర్యటనలతో కాంగ్రెస్ లో జోష్‌

- గత ఎన్నికల ఊపునే కొనసాగించేందుకు బీజేపీ ప్రయత్నాలు

- ఉనికి కోసం పోటీలో బీఆర్‌ఎస్‌

- రవసత్తరంగా పల్లెపోరు

- పల్లెల్లో ఓట్ల సందడి

నిర్మల్‌(ఆదిలాబాద్): జిల్లాలోని 400 గ్రామ పంచాయతీలకు గానూ ఒక్క పెర్కపల్లి గ్రామపంచాయతీ మినహా 399 గ్రామ పంచాయతీల్లో మూడు దశల్లో ఎన్నికలు ని ర్వహించనున్నారు. ఇప్పటికే మొదటి, రెండో దశ నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడం, మూడోదశకు సంబంధించిన ప్రక్రియ సైతం మొదలుకావడంతో ఇక పల్లెల్లో ఓట్ల సందడి విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే మూడు పార్టీల నాయకులు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు రోజుకో వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.


సవాలుగా తీసుకున్న కాంగ్రెస్‌

ముఖ్యంగా అధికార కాంగ్రె్‌సపార్టీ ఈగ్రామ పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు బాధ్యతలు స్వీకరించడం, ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించడం లాంటి పరిణామాలు కాంగ్రె్‌సకు సవాలుగా నిలుస్తున్నాయి. ఈఎన్నికల్లో భారీసంఖ్యలో గ్రామపంచాయతీల ను గెలుచుకొని తన సత్తాను చాటుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ మ ండల, గ్రామస్థాయి నాయకులకు ఆయా గ్రామ పంచాయతీల గెలుపుబాధ్యతలను అప్పగించడమే కాకుండా వారికి దన్నుగా నిలుస్తున్నారు.


సీఎం పర్యటనతో జోష్‌

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ప్రభావం నిర్మల్‌ జిల్లాలో జరిగే పంచాయతీ ఎన్నికలపై ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెడ్మబొజ్జు జిల్లాలోని సీనియర్‌ నాయకులందరితో చర్చలు మొదలుపెట్టారు. గ్రామ పంచాయతీల్లో భారీ మెజార్టీని దక్కించుకోవాలని, అందుకు నేతలంతా సమిష్టిగా కృషిచేయాలని బొజ్జు పార్టీ సీనియర్‌ నేతలందరిని కోరారు. నిర్మల్‌, ము థోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలం తా తమ పరిధిలోని మండలాల్లో అన్ని గ్రామ పంచాయతీలను దక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.


zz1.jpgపలువురి నామినేషన్లను ఉపసంహరణ చేయించారు. దీంతో జిల్ల్లాలో 16 గ్రామ పంచాయతీలు ఏకగీవ్రంగా ఎన్నిక కాగా అందులో ఏడేనిమిది కి పైగా కాంగ్రెస్‌ మద్దతుదారులే పదవులు దక్కించుకున్నారు. ముథోల్‌లో మాజీ ఎమ్మెల్యేలు నారాయణ రావు పటేల్‌, విఠల్‌రెడ్డిలతో పాటు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆనంద్‌ రావు పటేల్‌ తదితరులు తమ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. నిర్మల్‌లో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షు డు శ్రీహరిరావులు కూడా తమ పరిధిలోని మండలా ల్లో పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.


ఈసారి బలంగానే బీజేపీ

మొన్నటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చాలాచోట్ల మెజార్టీ ఓట్లను దక్కించుకున్న బీజేపీ ఈసారికూడా అదేఊపును కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌, జిల్లా అధ్యక్షుడు రితేష్‌ రాథోడ్‌లు తమ నియోజకవర్గాల్లోని గ్రామ పంచాయ తీల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామపంచాయతీల ముఖ్యనేతలతో చర్చిస్తూ గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి నిర్మల్‌లోనే ఉంటూ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఆయన తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గట్టి పోటీనిచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముథోల్‌లో కూడా రామారావు పటేల్‌ మెజార్టీ గ్రామ పంచాయతీలను దక్కించుకునేందు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.


ఉనికి కోసం బీఆర్‌ఎస్‌

గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఈసారి గట్టి పోటీనిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఖానాపూర్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఖానాపూర్‌లో ఆ పార్టీ ఇన్‌చార్జీ జాన్సన్‌ నాయక్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌, బీజేపీలకు చెక్‌పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ముథోల్‌లో ఆ పార్టీ నేతలు కిరణ్‌ కొమురేవార్‌, రమాదేవి, విలాస్‌ గాదేవార్‌తో పాటు మరికొందరు కూడా గట్టి పోటీనిచ్చేందుకు తమ పార్టీ తరఫున బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతున్నారు. నిర్మల్‌ నియోజకవర్గంలో మాత్రం కొన్ని గ్రామాల్లోనే ఆ పార్టీ ప్రభావం చూపించే అవకాశాలుండగా మిగతా గ్రామాలపై కనీస పట్టు సాధించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. వెండి ధరలో భారీ కోత

రూ.100తో వారసత్వ భూముల రిజిస్ర్టేషన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 06 , 2025 | 10:34 AM