Share News

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌కు స్పీకర్ క్లీన్ చిట్..

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:18 AM

పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నట్లు స్పీకర్ తీర్పు ఇచ్చారు.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌కు స్పీకర్ క్లీన్ చిట్..
MLA Sanjay Kumar

హైదరాబాద్, ఫిబ్రవరి 4: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌కు (MLA Sanjay Kumar) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) క్లీన్‌చిట్ ఇచ్చారు. సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని, ఆయన్ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నామని తెలంగాణ స్పీకర్ తీర్పు ఇచ్చారు. దీనికి సంబంధించిన గెజిట్‌ను కాసేపట్లో విడుదల చేసే అవకాశం ఉంది. సంజయ్‌పై అనర్హత కోరుతూ జగదీష్‌రెడ్డి పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఇక, పార్టీ ఫిరాయిపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యేకు కూడా క్లిన్ చిట్ ఇచ్చేశారు స్పీకర్.


నేను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే: ఎమ్మెల్యే సంజయ్

స్పీకర్‌ ఇచ్చిన తీర్పుపై జగిత్యాల ఎమ్మెల్యే స్పందిస్తూ... ‘ నేను బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే. బీఆర్‌ఎస్‌ పార్టీలోనే గెలిచా. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే అని అఫిడవిట్ ఇచ్చా. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పార్టీ బిల్లులు ప్రవేశపెట్టి, విప్ జారీ చేస్తే నేను మద్దతు ఇస్తా. నేనెప్పుడూ బీఆర్‌ఎస్ పార్టీని, అధిష్టానాన్ని విమర్శించలేదు. స్థానిక బీఆర్‌ఎస్ నాయకత్వం నాకు దూరంగా ఉంది. నాది ఎలక్షన్ కోసం కాదు.. అభివృద్ధి కోసం ఆరాటం. జగిత్యాల అభివృద్ధి కోసం సీఎం, ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నా’ అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

బీజేపీ తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్

భారత్‌తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. గంభీర్ స్పందనిదే!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 12:05 PM