భారత్‌తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. గంభీర్ స్పందనిదే!
ABN , Publish Date - Feb 04 , 2026 | 10:08 AM
టీ20 ప్రపంచ కప్ 2026 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది.పాక్ ప్రభుత్వం నిర్ణయం మేరకు టోర్నీలో పాల్గొంటాం కానీ గ్రూప్ స్టేజిలో భారత్‌తో జరిగే మ్యాచును బహిష్కరిస్తున్నట్లు పీసీబీ తెలిపింది. ఈ అంశంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ప్రశ్న ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించడంతో.. ఆ దేశానికి మద్దతుగా పాకిస్థాన్ కూడా ప్రపంచ కప్ నుంచి వైదొలగాలనుకుంది. పాక్ ప్రభుత్వం నిర్ణయం మేరకు టోర్నీలో పాల్గొంటాం కానీ గ్రూప్ స్టేజిలో భారత్‌తో జరిగే మ్యాచును బహిష్కరిస్తున్నట్లు పీసీబీ(PCB) తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌పై అనిశ్చితి నెలకొంది. ఈ అంశంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ప్రశ్న ఎదురైంది. నేడు భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. దీనికి కోసం గౌతీ ముంబై బయలుదేరాడు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో విలేకరులు గంభీర్(Gautam Gambhir)ను పాక్ వివాదంపై ప్రశ్నలు సంధించారు. కాగా అతడు సమాధానం ఇవ్వడానికి నిరాకరించాడు.
టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026)లో పాల్గొనడానికి పాకిస్థాన్ జట్టుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ.. భారత్‌తో మ్యాచ్‌కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్ ఏలో అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాతో కలిసి ఉన్నాయి. ఫిబ్రవరి 7న కొలంబోలో పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య టోర్నీ ఆరంభ మ్యాచ్ జరగనుండగా అదే రోజు భారత్.. అమెరికాతో తలపడనుంది. పాక్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని టీమిండియాతో మ్యాచ్ ఆడాలని పీసీబీకి పలుమార్లు ఐసీసీ హెచ్చరికలు జారీ చేసింది. రెవెన్యూ పరంగా భారత్, పాక్ మ్యాచ్‌కు ప్రాధాన్యమున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్
అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!