Home » Jagitial
తల్లిదండ్రులపై ఓ కూతురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావడం లేదంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తామని రూల్ పెట్టారా అని ప్రశ్నించారు.
కల్లూరు జిల్లాలో ఓ వింత కేసు వెలుగు చూసింది. తన సామాజిక వర్గం మహిళలు గాజుల పండగకు ఆహ్వానం ఇవ్వలేదంటూ.. ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గంజాయి కేసులో ముగ్గురు పట్టుబడటం.. స్థానికంగా రెండేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసు మిస్టరీని తేటతెల్లం చేసింది.
తమ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని గ్రామంలోని దళిత యువకుడిపై ఓ వర్గం వారు కోపం పెంచుకున్నారు. నచ్చజెబితే వినడం లేదని అతడిపై పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు.
ఫ్యాన్‌కు టవల్‌ను చుట్టి ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు అది మెడకు చుట్టుకొని మృతి చెందింది.
జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకున్న ఐదేళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలిక(బాబాయ్ భార్య) చిన్నమ్మ మమతపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్‌లో దారుణం జరిగింది. శనివారం సాయంత్రం నుంచి ఐదు సంవత్సరాల చిన్నారి హితిక్ష కనిపించకుండా పోయింది. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు, బంధువులు వెతికారు. కొంతసేపటికే అదే కాలనీలోనీ ఓ ఇంటి బాత్ రూంలో రక్తపు మడుగులో ఆ చిన్నారి పడి ఉంది.
అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆడుకునేందుకు సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె.. అదే కాలనీలోని మరొకరి ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించింది.
ఊళ్లో అభివృద్ధి పనుల కోసం అప్పులు చేసి ఖర్చు పెట్టిన నిధులు రాకపోవడం, డబ్బులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు.