Jeevan Reddy Vs Sanjay Kumar: వారి మాటే వింటారా.. మాకు ప్రాధాన్యత లేదా.. జీవన్ రెడ్డి ఫైర్
ABN , Publish Date - Oct 20 , 2025 | 03:14 PM
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావడం లేదంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తామని రూల్ పెట్టారా అని ప్రశ్నించారు.
జగిత్యాల, అక్టోబర్ 20: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) వ్యవహారశైలి పట్ల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Former MLC Jeevan Reddy) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఫిర్యాదు చేశారు. వలస దారులు చెప్తేనే పనులు చేస్తారా అంటూ మంత్రి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు చెప్తే పనులు చేయరా అంటూ మండిపడ్డారు. పదేళ్లు దోచుకున్న అనుభవం ఉందని.. అతడి మాటలే వింటారా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తామని రూల్ పెట్టారా అని ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయించినోడికి.. ప్రాధాన్యత ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఉన్న వారిని పట్టించుకోరా ఆవేదన చెందారు. పార్టీ ఫిరాయించినోడికి ఇప్పటికీ సభ్యత్వం లేదంటూ ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.
కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో..
కాగా.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈరోజు (సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు చేసేముందు బీఆర్‌ఎస్‌పై కవిత చేసిన ఆరోపణలకు కేటీఆర్ ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్లకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. దోచుకోవడం, దాచుకోవడం కేసీఆర్ కుటుంబానికే తెలుసన్నారు. మంత్రులపై ఆరోపణలు చేసే ముందు కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో అంటూ హెచ్చరించారు. ధర్మపురికి డిగ్రీ కళాశాల మంజూరు చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
కానిస్టేబుల్ ప్రమోద్‌కు ఘన నివాళులు.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన డీజీపీ
దీపావళికి డెలివరీ బాయ్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్న ఓ వ్యక్తి..
Read Latest Telangana News And Telugu News