Delivery Boys News: దీపావళికి డెలివరీ బాయ్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్న ఓ వ్యక్తి..
ABN , Publish Date - Oct 20 , 2025 | 01:46 PM
'మేము స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ నుంచి దీపావళికి స్వీట్లను ఆర్డర్ చేసాము, తిరిగి వాటిని తెచ్చిన డెలివరీ ఇచ్చామని' డిజిటల్ క్రియేటర్ గుండేటి మహేంద్ర రెడ్డి అన్నారు.
హైదరాబాద్: దీపావళి పండుగకు స్వీట్లు, వివిధ రకాల వస్తువులను మన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు బహుమతులుగా ఇస్తుంటాము. అయితే హైదరాబాద్‌లోని ఒక వ్యక్తి దీపావళికి డెలివరీ బాయ్స్‌కు బహుమతులను అందజేశారు. దీపావళిని నగర డెలివరీ సిబ్బందికి ఒక వేడుకగా మార్చారు. డిజిటల్ క్రియేటర్ గుండేటి మహేంద్ర రెడ్డి అనే వ్యక్తి స్విగ్గీ, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్, జెప్టో వంటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి స్వీట్లను ఆర్డర్ చేశాడు. అనంతరం ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ స్వీట్లను తిరిగి డెలివరీ పాట్నర్లకు అందజేస్తూ.. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇలా అందజేస్తున్న వీడియాను మహేంద్ర రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా డిజిటల్ క్రియేటర్ గుండేటి మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. 'మేము స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ నుంచి దీపావళికి స్వీట్లను ఆర్డర్ చేసాము, తిరిగి వాటిని తెచ్చిన డెలివరీ బాయ్స్‌కు ఇచ్చాము అని అన్నారు. డెలివరీ ఏజెంట్ల కష్టాలను గుర్తించి, వారికి కృతజ్ఞత చూపించడానికి దీపావళికి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం వివిధ యాప్‌ల నుంచి స్వీట్లను ఆర్డర్ చేసినట్లు ఆయన వీడియో కింద రాసుకొచ్చారు.
'చివరకు ఎవరో ఒకరు తమ ప్రయత్నాలకు ప్రతిఫలం ఇస్తున్నారు అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. మరొకరు, అది చాలా దయగల పని అని రాశారు. హోలీ నాడు కూడా వారికి నగదుతో పాటు స్వీట్లు, చాక్లెట్ ఇచ్చాను. డెలివరీ చేసే వ్యక్తి ముఖంలో చిరునవ్వు చాలా సంతృప్తికరంగా ఉంది. భవిష్యత్తులో వచ్చే పండుగల సమయంలో ఇతరులు కూడా ఇదే విధంగా చేయాలని ప్రేరేపించడానికే తాను ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ వీడియో వీక్షణల కోసం ఉద్దేశించబడలేదని దానిని తప్పుగా అర్థం చేసుకుంటే పండుగ తర్వాత దాన్ని తొలగిస్తానని డిజిటల్ క్రియేటర్ గుండేటి మహేంద్ర రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Maoist Party Expels Leaders: మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు
JEE Main 2026: జేఈఈ మెయిన్-2026షెడ్యూల్ విడుదల