Share News

JEE Main 2026: జేఈఈ మెయిన్‌-2026షెడ్యూల్‌ విడుదల

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:04 AM

జేఈఈ మెయిన్‌-2026 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆదివారం ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ను జనవరిలో...

JEE Main 2026: జేఈఈ మెయిన్‌-2026షెడ్యూల్‌ విడుదల

  • మొదటి సెషన్‌ జనవరి 21-30వరకు నిర్వహణరెండో సెషన్‌ ఏప్రిల్‌ 1-10వ తేదీ వరకు

  • దరఖాస్తుల్లో తప్పులు జరగకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆధార్‌ డేటాబే్‌సతో లింక్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 19: జేఈఈ మెయిన్‌-2026 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆదివారం ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ను జనవరిలో, రెండో సెషన్‌ను ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. మొదటి సెషన్‌ పరీక్షలు జనవరి 21 నుంచి 30వరకు జరుగుతాయి. రెండో సెషన్‌ పరీక్షలను ఏప్రిల్‌ 1 నుంచి 10వరకు నిర్వహిస్తారు. జనవరి సెషన్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అక్టోబరులోనే ప్రారంభం అవుతుంది. విద్యార్థులు రెండు సెషన్లలో ఏదైనా ఒకటి రాయవచ్చు. లేదా రెండూ రాయవచ్చు. ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. కాగా, జేఈఈ మెయిన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు దరఖాస్తుల్లో తప్పులు దొర్లకుండా ఉండేందుకు.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆధార్‌ డేటాబే్‌సతో అనుసంధానం చేశారు. విద్యార్థి ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే.. అతని పేరు, వయస్సు, చిరునామా ఇలా ఆధార్‌ కార్డులోని అన్ని వివరాలు రిజిస్ట్రేషన్‌ ఫారంలోకి ఆటోమేటిక్‌గా వస్తాయి. విద్యార్థుల వివరాలు ఆధార్‌ కార్డులో ఒకలా.. స్కూల్‌ సర్టిఫికెట్లలో మరోలా ఉంటున్న నేపథ్యంలో ఎన్‌టీఏ దరఖాస్తు ప్రక్రియను ఆధార్‌తో అనుసంధానం చేసింది.

Updated Date - Oct 20 , 2025 | 04:04 AM