Home » Swiggy
దేశంలోని లక్షలాది మంది గిగ్ వర్కర్లలో అతడు కూడా ఒకడు. మామూలు స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. అయితే తనకు ఎదురైన ఒక ప్రమాదాన్ని అనుకూలంగా మలుచుకున్నాడు.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ త్వరలో ఆహార డెలివరీ రంగంలోకి కూడా అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఆన్‌లైన్ షాపింగ్, క్విక్ కామర్స్ సేవలు అందిస్తున్న సంస్థ ఆగస్టు 15వ తేదీ నుంచి బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి డెలివరీ సంస్థలకు చెందిన గిగ్ వర్కర్లు ఇవాళ సమ్మెకు దిగనున్నారు. ఇంధన ధరల పెరుగుదలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ఐదు గంటల సమ్మెను ప్రకటించింది.
మన హైదరాబాద్ బిర్యానీ మరోసారి అదుర్స్ అనిపించుకుంది. గతేడాది రూ.1.75 కోట్ల బిర్యానీలను హైదరాబాదీలు స్విగ్గీలో ఆర్డర్ చేసేశారని ఆ సంస్థ పేర్కొంది. అర్ధరాత్రి సమయంలోనే 6 లక్షలు ఆర్డర్లు ఈ చికెన్ బిర్యానీకి వచ్చాయి.
హైదరాబాద్ నగర వాసులు 2025 సంవత్సరంలో అత్యధికంగా కొనుగోళ్లు చేసినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నివేదిక వెల్లడించింది. ఆన్‌లైన్‌లో కొనుగోలుకు ఆయా సంస్థలు ఉన్నప్పటికీ ఎక్కువగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఎంచుకోవడం గమనార్హం.
ఓ యూజర్ 2025లో తమ ప్లాట్‌ఫామ్‌పై ఏకంగా రూ.22 లక్షలను ఖర్చు చేశారని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తెలిపింది. అంతేగాక దేశంలోనే అత్యధికంగా ఒకే ఆర్డర్‌పై రూ.4.3 లక్షలను ఓ హైదరాబాదీ ఐ ఫోన్‌ల కోసం ఆర్డర్ చేశాడని స్విగ్గీ పేర్కొంది. ఆ సంస్థ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
'మేము స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ నుంచి దీపావళికి స్వీట్లను ఆర్డర్ చేసాము, తిరిగి వాటిని తెచ్చిన డెలివరీ ఇచ్చామని' డిజిటల్ క్రియేటర్ గుండేటి మహేంద్ర రెడ్డి అన్నారు.
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి బ్యాడ్ న్యూస్. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి వారిపై అదనపు భారం పడనుంది. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ఆహారం తెప్పించుకోవడం మరింత ఖరీదు కానుంది. డెలివరీ ఛార్జీలపై ప్రభుత్వం కొత్తగా 18 శాతం జీఎస్టీ విధించడమే ఇందుకు కారణం.
ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడం అనేక మందికి మామూలైపోయింది. బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో లేదా బిజీగా ఉన్నపుడు జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. కానీ తాజాగా వచ్చిన మార్పులతో ఫుడ్ డెలివరీ మరింత ఖరీదయ్యేలా కనిపిస్తోంది.
ఫుడ్ లవర్స్ కి కీలక అలర్ట్. ఎందుకంటే ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ, హై డిమాండ్ ప్రాంతాల్లో తన ఫీజును 17% పెంచి రూ.14కి చేర్చింది. ఇది పండుగ సీజన్‌లో పెరిగిన డిమాండ్ కారణంగా తాత్కాలిక చర్య అని చెబుతున్నారు.