Share News

Food Delivery Costlier: మరింత ఖరీదైనదిగా ఫుడ్ డెలివరీ..జీఎస్టీ కారణంగా ఫీజు పెంపు తప్పదా

ABN , Publish Date - Sep 08 , 2025 | 09:33 AM

ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడం అనేక మందికి మామూలైపోయింది. బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో లేదా బిజీగా ఉన్నపుడు జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. కానీ తాజాగా వచ్చిన మార్పులతో ఫుడ్ డెలివరీ మరింత ఖరీదయ్యేలా కనిపిస్తోంది.

Food Delivery Costlier: మరింత ఖరీదైనదిగా ఫుడ్ డెలివరీ..జీఎస్టీ కారణంగా ఫీజు పెంపు తప్పదా
Food Delivery Costlier

ఎప్పటిలాగే ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా. అయితే ఈ కొత్త రేట్ల గురించి ఓసారి తెలుసుకోండి. ఎందుకంటే జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు తమ ప్లాట్‌ఫాం ఫీజులను ఇప్పటికే పెంచేశాయి. దీంతోపాటు సెప్టెంబర్ 22 నుంచి డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ కూడా విధించబోతోంది. దీంతో కస్టమర్లపై అదనపు భారం పడనుంది.


ఫీజులు ఎందుకు పెరిగాయి?

జొమాటో, స్విగ్గీ, మ్యాజిక్‌పిన్‌లు తమ సేవలను మెరుగుపరచడానికి, ఆపరేషన్ ఖర్చులను భరించడానికి ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచాయి. ఇప్పుడు స్విగ్గీ కొన్ని మార్కెట్లలో ఫీజును రూ.15 (GST సహా) చేసింది. జొమాటో రూ.12.50 (జీఎస్టీ లేకుండా) వసూలు చేస్తోంది. మ్యాజిక్‌పిన్ కూడా ఆర్డర్‌కు రూ.10 ఫీజు నిర్ణయించింది. ఇవి కాకుండా, డెలివరీ ఛార్జీలపై కొత్తగా వచ్చిన 18% జీఎస్టీ వల్ల జొమాటో యూజర్లకు సుమారు రూ.2, స్విగ్గీ యూజర్లకు రూ.2.6 ఎక్స్‌ట్రా ఖర్చు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మ్యాజిక్‌పిన్ (Magicpin) మాత్రం మా ఫీజులపై ఈ జీఎస్టీ మార్పు ప్రభావం చూపదని చెబుతోంది. మేం ఇప్పటికే 18% జీఎస్టీ చెల్లిస్తున్నాం. మా ప్లాట్‌ఫాం ఫీ ఆర్డర్‌కు రూ.10గానే ఉంటుందని ప్రకటించింది. ఇది మిగతా ఫుడ్ డెలివరీ యాప్‌లతో పోలిస్తే తక్కువే అని ప్రకటించింది.


ఇప్పుడు కొత్తగా ఎంత ఖర్చవుతుందంటే?

  • Swiggy: ప్రస్తుతం కొన్ని మార్కెట్లలో ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.15 (GST సహా)గా ఉంది.

  • Zomato: రూ.12.50 ఫీజు వసూలు చేస్తోంది (GST కాకుండా).

  • Magicpin: రూ.10 ఫీజుతో కొనసాగుతోంది (జీఎస్టీ సహా)


ఈ ఫీజులు ఎందుకు ముఖ్యం?

ఈ ప్లాట్‌ఫామ్ ఫీజులు ఫుడ్ డెలివరీ కంపెనీలకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. డెలివరీ బాయ్స్ జీతాలు, టెక్నాలజీ మెయింటెనెన్స్, కస్టమర్ సపోర్ట్ వంటి ఖర్చులను భరించడానికి ఈ ఫీజులు ఉపయోగపడతాయని సంస్థలు చెబుతున్నాయి. కానీ, ఈ ఫీజుల పెంపు మధ్యతరగతి కస్టమర్లకు ఆర్డర్ ఖర్చును పెంచుతోంది. ముఖ్యంగా, ఫెస్టివల్ సీజన్‌లో ఇలాంటి పెంపు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది.

ఇది మన జేబుపై ఎలా పడుతుంది?

ఒక ఆర్డర్‌కు రూ.10-15 ప్లాట్‌ఫాం ఫీ, అంతకు మించి రూ.2-3 జీఎస్టీ ఛార్జీలు అదనంగా కట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీరు వారంలో 4 సార్లు ఫుడ్ ఆర్డర్ చేస్తే, నెలకు ఈ ఎక్స్‌ట్రా ఫీజుల వల్ల రూ.100-150 అదనంగా ఖర్చు అవుతుంది. చిన్న మొత్తంలా అనిపించినా, క్రమంగా ఆర్డర్ చేసే వాళ్లకు దీని ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి క్రమంలో గ్రూప్ ఆర్డర్స్, ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి ఆర్డర్ చేస్తే ఫీజులు తక్కువగా ఉండే ఛాన్సుంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 08 , 2025 | 09:33 AM