Share News

Swiggy Instamart: హైదరాబాదీల కొనుగోలు తీరే వేరయా...

ABN , Publish Date - Dec 24 , 2025 | 10:10 AM

హైదరాబాద్ నగర వాసులు 2025 సంవత్సరంలో అత్యధికంగా కొనుగోళ్లు చేసినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ నివేదిక వెల్లడించింది. ఆన్‏లైన్‏లో కొనుగోలుకు ఆయా సంస్థలు ఉన్నప్పటికీ ఎక్కువగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ ఎంచుకోవడం గమనార్హం.

Swiggy Instamart: హైదరాబాదీల కొనుగోలు తీరే వేరయా...

- స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ నివేదిక

హైదరాబాద్‌ సిటీ: రోజువారీ నిత్యావసరాలు మొదలు వార్తా పత్రికల హెడ్‌లైన్‌లలో ప్రచురితమయ్యేంతగా చేసే కొనుగోళ్ల వరకు హైదరాబాదీల కొనుగోలు తీరు భిన్నమని చెబుతోంది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌(Swiggy Instamart) సంస్థ. హౌ ఇండియా ఇన్‌స్టామార్టెడ్‌ 2025 పేరుతో ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధిక సింగిల్‌ కార్ట్‌ విలువను నమోదు చేసిన నగరం, ప్రేమికుల రోజున గులాబీల కోసం అత్యధికంగా ఖర్చు చేసిన ఓ కొనుగోలుదారునితో ప్రేమనగరంగానూ ఖ్యాతిని గడించిందని పేర్కొంది.


city7.2.jpg

హైదరాబాద్‌లో పూల కోసం రూ.31వేలు ఒకరు ఖర్చు చేస్తే ఐఫోన్‌ల కోసం రూ.4.3 లక్షలను ఒకటే ఆర్డర్‌లో మరొకరు చెల్లించారని తెలిపింది. వీరితో పోటీపడి ఇంకో వినియోగదారుడు శీతల పానీయాల కోసం రూ.1.92 లక్షలు ఖర్చు చేయడమూ హైదరాబాద్‌లోనే కనిపించిందని తెలిపింది. ఇన్‌స్టామార్ట్‌లో మసాలా ఫ్లేవర్డ్‌ చిప్స్‌ తీసుకోవడమూ ఎక్కువేనని, ఇక్కడ ఎలకా్ట్రనిక్స్‌, జీవనశైలి ఉపకరణాల డిమాండ్‌ పరంగా గత సంవత్సరంతో పోలిస్తే 90శాతం వృద్ధి కనిపించిందని ఆ నివేదిక చెప్పుకొచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

నిరాశ వదిలించి...నవజీవనం వైపు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2025 | 10:10 AM