Food delivery cost: స్విగ్గీ, జొమాటో యూజర్లకు షాక్.. సెప్టెంబర్ 22 నుంచి పెరగనున్న ధరలు..
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:51 PM
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి బ్యాడ్ న్యూస్. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి వారిపై అదనపు భారం పడనుంది. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ఆహారం తెప్పించుకోవడం మరింత ఖరీదు కానుంది. డెలివరీ ఛార్జీలపై ప్రభుత్వం కొత్తగా 18 శాతం జీఎస్టీ విధించడమే ఇందుకు కారణం.
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి బ్యాడ్ న్యూస్. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి వారిపై అదనపు భారం పడనుంది. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ఆహారం తెప్పించుకోవడం మరింత ఖరీదు కానుంది. డెలివరీ ఛార్జీలపై ప్రభుత్వం కొత్తగా 18 శాతం జీఎస్టీ విధించడమే ఇందుకు కారణం. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. దీంతో వినియోగదారుల జేబుపై అదనపు భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది (food delivery cost increase).
పండుగల సందర్భంగా ఇప్పటికే జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు ఛార్జీలను పెంచాయి (Swiggy delivery charges). దీనికి తోడు సెప్టెంబర్ 22 నుంచి 18 శాతం జీఎస్టీ కూడా వర్తిస్తుండడంతో వినియోగదారులపై అదనపు భారం తప్పదు. సాధారణంగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లకు సంబంధించి రెండు రకాల పన్నులు వర్తిస్తాయి. ఒకటి ఆర్డర్ చేసే ఆహారంపై కాగా, మరొకటి డెలివరీకి సంబంధించినది. ప్రస్తుతం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మీద ఐదు శాతం పన్ను ఉంది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఆ పన్ను 18 శాతానికి పెరగబోతోంది (Zomato GST hike).
పెరిగే ఆ పన్నును వినియోగదారుల నుంచే సదరు ప్లాట్‌ఫామ్‌లు వసూలు చేస్తాయి (Sept 22 delivery changes). ఎంపిక చేసిన మార్కెట్లలో స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజుగా రూ.15 వసూలు చేస్తోంది. జొమాటో కూడా ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.12.50 (జీఎస్టీ మినహాయించి)కి పెంచింది (GST on delivery). ఇక, సెప్టెంబర్ 22 నుంచి వినియోగదారులు ఫ్లాట్‌ఫామ్ ఫీజుగా మరో ఐదారు రూపాయలను ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు
యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, సోనూసూద్‌కి ఈడీ నోటీసులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి