Share News

Betting App Case: యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, సోనూసూద్‌కి ఈడీ నోటీసులు

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:40 PM

అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ మేరకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసింది.

Betting App Case: యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, సోనూసూద్‌కి ఈడీ నోటీసులు
Betting App Case

ఢిల్లీ: అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ మేరకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్ విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. వీరితో పాటు నటుడు సోనూసూద్‌కి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపారు. వచ్చే సోమవారం ఉతప్ప, యువరాజ్ మంగళవారం, బుధవారం సోనూసూద్ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.


ఈనెల 14వ తేదీన సినీ నటి ఊర్వశి రౌతేలా, మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మిమి చక్రవార్తి నిన్న(సోమవారం) విచారణ హాజరు కాగా.. ఇవాళ(మంగళవారం) ఊర్వశి రౌతేలా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. వీరిపై మనీ లాండరింగ్ చట్టం ఉల్లంఘనతో పాటు అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో భాగస్వామ్యం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ వీరికి సమన్లు జారీ చేసింది. కాగా, 1xBetతో పాటు పలు బెట్టింగ్ యాప్‌లు వినియోగదారులు, పెట్టుబడిదారులను మోసం చేశాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో, ఈడీ మనీ లాండరింగ్, పన్ను ఎగవేత కోణంలో పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Updated Date - Sep 16 , 2025 | 01:56 PM