Telangana Police Tribute: కానిస్టేబుల్ ప్రమోద్‌కు ఘన నివాళులు.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన డీజీపీ
ABN , Publish Date - Oct 20 , 2025 | 02:17 PM
భర్త ప్రమోద్‌ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్థాయిలో అండగా ఉంటామని డీజీపీ శివధర్ హామీ ఇచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 20: కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్‌కు పోలీసు శాఖ తరుపున ఘన నివాళులు అర్పించారు డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy). సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో లా అండ్ ఆర్డర్‌ను పూర్తి స్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్ధతతో ఉందని డీజీపీ స్పష్టం చేశారు. ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తామని వెల్లడించారు. భర్త ప్రమోద్‌ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్థాయిలో అండగా ఉంటాయని హామీ ఇచ్చారు.
జీవో ఆర్టీ నెంబర్ 411 ప్రకారం ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబసభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. జీవో 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామన్నారు. అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు డీజీపీ. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరుపున డీజీపీ శివధర్ రెడ్డి నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి..
దీపావళికి డెలివరీ బాయ్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్న ఓ వ్యక్తి..
కొత్త అల్లుడికి మామ అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఇట్స్ వెరీ స్వీట్
Read Latest Telangana News And Telugu News