Balka Suman on Congress: సీఎం రేవంత్ రెడ్డివి ఫ్యూడలిస్టు ఆలోచనలు: బాల్క సుమన్
ABN , Publish Date - Oct 20 , 2025 | 01:12 PM
అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇందిరమ్మ రాజ్యంలో బందీ చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 20: కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల్లో చీకట్లే కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో మీడియాసమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకు గన్ లతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇందిరమ్మ రాజ్యంలో బందీ చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయన్న సుమన్.. దళిత మంత్రిని పట్టుకొని సహచర మంత్రులు ఏ విధంగా మాట్లాడారో చూశామని అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేశారో లేదో చెప్పి కాంగ్రెస్ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూడలిస్టు ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. బీజేపీ పార్టీతో కలిసిపోయి పనిచేస్తుంది ఈదేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆరోపించారు. సదర్ ఉత్సవాల్లో బీజేపీ నాయకులతో వేదికలు పంచుకుంది రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి జీన్స్ లోనే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందన్నారు. బీజేపీ నాయకులు ముఖ్యమంత్రిని కాపాడే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
Vemulawada Temple: రాజన్న ఆలయంలో దర్శనం నిలిపివేత.. భక్తుల మండిపాటు
Food Safety Officials Inspections: హైదరాబాద్ వ్యాప్తంగా స్వీట్ షాప్స్‌పై రైడ్స్ .. నోటీసులు జారీ