Vemulawada Temple: రాజన్న ఆలయంలో దర్శనం నిలిపివేత.. భక్తుల మండిపాటు
ABN , Publish Date - Oct 20 , 2025 | 11:14 AM
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వామి వారి దర్శనాలు నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుశేఖర స్వామి పూజలపై ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు భక్తులు.
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 20: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో (Vemulawada Temple) అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అయితే శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర స్వామి పూజల సందర్బంగా భక్తులకు దర్శనలను నిలిపివేశారు ఆలయ అధికారులు. దీంతో గంటల తరబడి స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వామి వారి దర్శనాలు నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుశేఖర స్వామి పూజలపై ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు భక్తులు.
ఈ విషయాన్ని అడిగేందుకు కూడా అధికారులు అందుబాటులో లేని పరిస్థితి. దీంతో భక్తులకు సమాధానం చెప్పే అధికారులు కూడా లేకపోవడంపై రాజన్న భక్తులు ఫైర్ అవుతున్నారు. దర్శనాలు లేవు అని కనీసం ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయండి..లోకేష్ పిలుపు
కొత్త అల్లుడికి మామ అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఇట్స్ వెరీ స్వీట్
Read Latest AP News And Telugu News