Food Safety Officials Inspections: హైదరాబాద్ వ్యాప్తంగా స్వీట్ షాప్స్‌పై రైడ్స్ .. నోటీసులు జారీ
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:30 PM
దీపావళి సందర్భంగా నిర్విరామంగా స్వీట్ షాప్స్‌పై రైడ్స్ చేస్తున్నారు. శాంపిల్స్ సేకరించిన అధికారులు.. టెస్ట్ కోసం ల్యాబ్‌కు పంపించారు. నగరంలో 45 స్వీట్ షాపుల్లో తనిఖీలు విస్తృతం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 20: హైదరాబాద్ వ్యాప్తంగా స్వీట్ షాప్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా నిర్విరామంగా స్వీట్ షాప్స్‌పై రైడ్స్ చేస్తున్నారు. శాంపిల్స్ సేకరించిన అధికారులు.. టెస్ట్ కోసం ల్యాబ్‌కు పంపించారు. నగరంలో 45 స్వీట్ షాపుల్లో తనిఖీలు విస్తృతం చేశారు. భారీగా సింథటిక్ కలర్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. కల్తీ నెయ్యి, కల్తీ వంట నూనెతో నిర్వాహకులు స్వీట్స్ తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. కిచెన్‌లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తింపు వెల్లడించారు. స్వీట్స్ తయారు చేసే స్థలంలో ఈగలు, దోమలు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని స్వీట్ షాప్స్‌లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్, ఎక్స్ పైరీ డేట్ లేదని అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించని స్వీట్ షాప్స్‌పై కొరడా ఝుళిపించిన అధికారులు.. పలు హోటళ్లకు నోటీసులు జారీ చేశారు.
దీపావళి పండుగ రోజు స్వీట్స్‌ను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీంతో భారీగా స్వీట్లు అమ్ముడుపోతాయి. ఈ క్రమంలోనే హోటల్ యాజమానులు నాసికారంగా మధుర పదార్థాలను తయారు చేస్తున్నారు. కల్తీ పధార్ధాలతో స్వీట్లను తయారు చేసి, టేస్ట్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కల్తీ చేస్తున్నారు. ఈ స్వీట్లు తింటే ఫుడ్ పాయిజన్ అవ్వడమే కాకుండా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఈ తరుణంలోనే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.