Telangana Crime: తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ
ABN , Publish Date - Oct 20 , 2025 | 01:29 PM
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో పండగపూట విషాదం నెలకొంది. నాగలక్ష్మి అనే మహిళ.. తన ఇద్దరు పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 20: తెలంగాణలోని నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో పండగపూట విషాదం నెలకొంది. నాగలక్ష్మి అనే మహిళ.. తన ఇద్దరు పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో సోమవారం పండుగ పూత తీవ్ర విషాదంచోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలను చంపిన తల్లి, ఆ తర్వాత తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. నిర్గాంతపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతులను కుంచాల నాగలక్ష్మి (27), భువన్ సాయి (7), అవంతిక (9)గా గుర్తించారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా జనకారం గ్రామం అని తెలిపారు. భార్యా భర్తల గొడవే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Balka Suman on Congress: సీఎం రేవంత్ రెడ్డివి ఫ్యూడలిస్టు ఆలోచనలు: బాల్క సుమన్
Food Safety Officials Inspections: హైదరాబాద్ వ్యాప్తంగా స్వీట్ షాప్స్‌పై రైడ్స్ .. నోటీసులు జారీ